హాట్ న్యూస్: ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం పూజ జరిగింది
హైదరాబాద్: ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం పూజా కార్యక్రమాలు ఈ రోజు (డిసెంబర్ 18) ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయంలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్తరం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది. ఈ రోజు ముహూర్తం బాగుండటంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. మా బేనర్ లో ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











