రామ్ చరణ్ కోసం అభిమానుల పూజలు (ఫోటో)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' రేపు(సెప్టెంబర్ 6) ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేప్యథ్యంలో చరణ్ బాలీవుడ్ ఎంట్రీ సక్సెస్ కావాలని కోరుతూ రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో అభిమానులు ఫిల్మ్ నగర్ టెంపుల్లో పూజలు నిర్వహించారు.
రామ్ చరణ్ తొలి బాలీవుడ్ మూవీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా.....చిత్రం విడుదలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ సక్సెస్ అయితే అతని రేంజ్, రెమ్యూనరేషన్ రెండూ పెరిగే అవకాశం ఉంది. సినిమాను సక్సెస్ చేసేందుకు ఫ్యాన్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. తెలుగులో ఈ చిత్రం 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.


Click it and Unblock the Notifications












