twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్విమ్ సూట్ లో ఐస్ బక్కెట్ ఛాలెంజ్ ( వీడియో)

    By Srikanya
    |

    ముంబై: ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల ‘ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌'గా విస్తృతమైన ప్రచారం పొందడం అందరికీ తెలిసిందే. అయితే కొందరు దీన్ని పద్దతిగా చేస్తూంటే ఈ మోడల్ , నటి , ఎఫ్ హెచ్ ఎమ్ కవర్ పేజీ అమ్మాయి అయిన పూజా మిశ్రా మాత్రం అందరిలా ఎందుకు అనుకుందో ఏమో కానీ , తనదైన శైలిలో ఇందులోనూ సెక్స్ గుప్పించే ప్రయత్నం చేసింది. స్విమ్ సూట్ వేసుకుని మరీ ఈ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ కు దిగింది. పేరున్న సెలబ్రెటీల ఐస్ బక్కెట్ ఛాలెంజ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఇదిగో ఇలా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న ఇలాంటివారికి ఈ తిప్పలు తప్పవేమో. మీరూ ఆ సెక్సీ ఛాలెంజ్ ని చూడండి..

    ఇక ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌ అనేది - ‘అమ్యోట్రోఫిక్‌ లేటరల్‌ స్కెలెరోసిస్‌' (ఎ.ఎల్‌.సి) అనే భయంకరమైన వ్యాధి మీద పోరాడేందుకు ఒక సంస్థ ప్రచార కృషిలో భాగం ఇది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో ఇద్దరిని పట్టిపీడిస్తోందీ జబ్బు. ఇది మెదడు, వెన్నుపూసల్లోని కణాలను దెబ్బతీసి.. మనిషిని పీల్చిపిప్పిచేస్తుంది. అమెరికాలోని బేస్‌బాల్‌ క్రీడాకారుడైన పెటె ఫ్రేట్స్‌ కూడా ఇదే జబ్బుతో సతమతమవుతున్నాడు. వ్యాధితో పోరాడటం ఎంత కష్టమో.. దీర్ఘకాలిక వైద్యం చేయించుకోవడం అంతకంటే కష్టం. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

    Pooja's Ice Bucket Challenge in Swimsuit!

    ఒక రోజున ఫ్రేట్స్‌ ఇంటికొచ్చిన అతని ఫ్రెండ్‌.. ‘‘ఇతరుల సాయం కోరడానికి మనమేదైనా అద్భుతం చేయగలమా?'' అన్నాడు. అప్పుడు అతనే ఐస్‌బకెట్‌ ఐడియా చెప్పాడు. ఎ.ఎల్‌.ఎస్‌. స్వచ్ఛంద సంస్థ కూడా తోడవ్వడంతో.. బాధితులకు ఆసరాగా నిలిచేందుకు ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌ వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెట్టారు. ఆ వీడియోలను చూసి.. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరించి.. చల్లటి బకెట్‌ నీళ్లను నెత్తిమీద పోసుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిలేగేట్స్‌, సీఈవో సత్య నాదెళ్ల, పాప్‌ సింగర్‌ బ్రిట్నీస్పియర్‌, లేడీగాగాలతో పాటు పలువురు భారతీయ సెలబ్రిటీలు సైతం ఐస్‌బకెట్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇంటర్‌నెట్‌ ద్వారా బకెట్‌ వింత అందరినీ ఆకర్షించడంతో.. ఎ.ఎల్‌.ఎస్‌.కు విరాళాలు వెల్లువెత్తడం విశేషం.

    సమ్మర్ ట్రెండ్: బికినీ డ్రెస్సులో పట్టుబడ్డ టాప్ హీరోయిన్స్ :క్లిక్ చేయండి

    English summary
    Model-turned-Actress Pooja Mishra, the cover girl of FHM for the month of September 2014, took up the ALS Ice Bucket Challenge. she has donated huge amount for this cause.She does this in her own style looking super hot in a monokini,raising the temperature and turning the ice into fire!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X