తెల్లగా ఉండే హీరోల ప్రక్కనే చేస్తానంది
ఆయన మాట్లాడుతూ... 'పూజకి మొగటి నుంచీ తెల్ల తోలు ఉండే హీరోలతోనే రొమాన్స్ చేయాలని కోరిక. అలా ఉంటేనే ఆడతాయని ఆమె అంటుంది. దీనికి ఓ ఉదాహరణ చెప్తాను. రీసెంటాగా హంతిక అనే చిత్రం కోసం నిర్మాతలు ఆమెను కలిసారు. అందులో హీరోయిన్ గా చేయమని అడిగారు. అయితే అందులో హీరోగా తిలక్ గానీ, సంతోష్ గానీ చేస్తారని చెప్పారు. దాంతో ఆమె రిజెక్టు చేసింది. వారిద్దరూ నల్లగా ఉంటారని వద్దంది. ఆమెకు తెల్లగా ఉండే ముంబై వాళ్లు అంటేనే ఇష్టం. అప్పుడు నేను తరుణ్ అరోరా అనే బాలీవుడ్ నటుడ్ని నా ఇన్ఫూలియన్స్ ఉపయోగించి పిలిపించాల్సి వచ్చింది. అయితే ఆ రంగు పిచ్చి కేవలం తెరపై వరకే పరిమితం అనుకున్నాను..నా దాకా వస్తుందనుకోలేదు. పెళ్లికి ముందే విషయం తెలియటం మంచిదైంది. లేకపోతే తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అందుకు చాలా సంతోషంగా ఉంది 'అన్నారు ఆనంద గౌడ ఆవేదనగా.
కన్నడ నటి పూజా గాంధీ వివాహం రద్దయింది. ఫైనాన్షియర్, బాలీవుడ్ చిత్ర నిర్మాత ఆనంద గౌడతో గత నెల 15న ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం పూజా గాంధీ ఇంటికి ఆనంద గౌడ వెళ్లినప్పుడు పూజా తల్లితో వాగ్వాదం జరిగింది. తదనంతరం వివాహాన్ని రద్దు చేసుకోవాలని పూజా గాంధీ నిర్ణయించింది. దీనిని ఆనంద గౌడ కూడా ధ్రువీకరించారు.
అలాగే ఆనంద్‌గౌడను తన తల్లి చులకనగా మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణల్ని పూజా గాంధీ తోసిపుచ్చారు. 'మా అమ్మను తూలనాడిన వ్యక్తిని వివాహం చేసుకునే ప్రసక్తేలేదు. నిశ్చితార్థం రోజున ఆనంద్‌గౌడ తొడిగిన ఉంగరాన్ని బుధవారం ఉదయం వెనక్కు పంపాను. నిశ్చితార్థం రద్దు కావడానికి ఆనంద్‌గౌడే కారణం. ఎవరు ఫోన్ చేసినా అనుమానంతో చూసేవాడు. అలాంటి వ్యక్తితో నూరేళ్ల జీవితం ఎలా గడిపేది. అందుకే వద్దనుకున్నాను అని తేల్చి చెప్పారు. పూజా గాంధీ తల్లి తనను దూషించిందని ఆనంద గౌడ ఆరోపించారు. పూజా గాంధీ మంచిదేనని, తల్లి చాటు బిడ్డగా వ్యవహరిస్తున్నందున ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications












