నా మొగుడు ఒక రోగ్.. చాలా మందితో*** ఎఫైర్ ఉంది.. సీనియర్ నటి

Recommended Video

Senior Actress Poojitha Reveals Secrets On Her Marriage And Personal Life || Filmibeat Telugu

సీనియర్ నటి పూజిత తన వ్యక్తిగత జీవితంపై మరోసారి నోరు విప్పింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన పూజిత, తన జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని తెలిపింది. తెలుగులో అప్పట్లో వచ్చిన 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' చిత్రంతో హీరో రాజేంద్ర ప్రసాద్‌కి రెండో భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత. తన భర్త గురించి గతంలోనే సంచలన ఆరోపణలు చేసిన ఆమె తాజాగా మరోసారి ఫైర్ అయింది..తన భర్త ఎలాంటి వాడు, అతనికి ఉన్న ఎఫైర్స్ ఏంటి? అనే విషయాలు చెప్పి ఆవేదన చెందింది. ఆమె చెప్పిన విషయాలు వివరంగా చూస్తే..

కాపురం కాదు సహజీవనం అంటున్నాడు

కాపురం కాదు సహజీవనం అంటున్నాడు

తన భర్త విజయ గోపాల్‌‌తో పెళ్లయ్యాక 14 ఏళ్ల పాటు కాపురం చేశానని, మా ఇద్దరికీ ఏడేళ్ల బాబు కూడా ఉన్నాడని, ఆ సమయంలో తనను వదిలి విజయ్ గోపాల్ వేరే పెళ్లి చేసుకోవడమే గాక, తాను ఆయనతో సహజీవనం చేసినట్లుగా బయట చెప్పాడని అంటోంది పూజిత. ఈ విషయం పోలీసులు, మీడియా దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అంటోంది పూజిత.

నాతో పెళ్లయ్యాక ప్లాన్ ప్రకారం

నాతో పెళ్లయ్యాక ప్లాన్ ప్రకారం

తనను పెళ్లి చూసుకున్న విజయ్ గోపాల్ తమ పెళ్ళికి సంబందించిన ప్రూఫ్స్ ఏవీ లేకుండా చేసి ప్లాన్ ప్రకారమే వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని అంటోంది పూజిత. అయితే అతను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఓ మహిళా ఐఏఎస్ కావడంతో తనకు పోలీసులు, మీడియా సహకారం లేదని ఆవేదన చెందింది పూజిత. పైగా అతనితో పెళ్ళైనట్లు ప్రూఫ్స్ ఉన్నాయా? అని ఆగుతున్నారని చెప్పింది.

మోసం చేసిన మొగుడు వద్దు.. కానీ ఎందుకు శిక్షించరు

మోసం చేసిన మొగుడు వద్దు.. కానీ ఎందుకు శిక్షించరు

వాళ్లడుగుతున్న ఎవిడెన్స్ ఎంటనేవి నాకు తెలుసు. కానీ వాళ్లు చెప్పినట్టు ఆధారాలు చూపించడానికి నేను రెడీగా లేను. నేను ఎప్పుడు కూడా నాకు నా మొగుడు కావాలని అడగలేదు. ఓ మహిళను మోసం చేసిన ఇలాంటి వాడిని ఎందుకు శిక్షించరు అని మాత్రమే అడుగుతున్నానని పూజిత తెలిపింది.

అదంతా ఎంగిలి.. అతనికి లెక్కలేనంత మందితో

అదంతా ఎంగిలి.. అతనికి లెక్కలేనంత మందితో

నా మొగుడికి చాలా మందితో ఎఫైర్ ఉంది. ఎంగిలి కంచం తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అతనో రోగ్.. కాని నేను మాత్రం అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా. ఆ రోజు ఏదైతే అడిగానో.. ఇప్పుడూ అదే అడుగుతున్నా. నేను ఏ విషయాన్ని వదల్లేను. ఇప్పటికీ వదలను. అలసట అనేది నా జీవితంలో లేదు. అతనికి తగిన శిక్ష పడాల్సిందే.. అని సంచలన ఆరోపణలు చేసింది పూజిత.

 ఆరోజే నేను గెలిచినట్టుగా భావిస్తున్నా

ఆరోజే నేను గెలిచినట్టుగా భావిస్తున్నా

తన దగ్గర ఆధారం లేకుండా చేయడంతో ఆ రోజు జనం ముందుకు రాలేక పోయా. కానీ అప్పుడే చెప్పా.. ఆధారం దొరికినప్పుడే మీ ముందుకు వస్తా అని. నిజానికి అతనితో నాకు పెళ్లి కాలేదని ఆ మహిళా అధికారి అన్నాక రెండు గంటలు టైం తీసుకుని ఫొటోలు విడుదల చేశా. ఆరోజే నేను గెలిచినట్టుగా భావిస్తున్నా. మొత్తానికి నా డిమాండ్ ఒక్కటే.. అతనికి సరైన శిక్ష పడాల్సిందే.. అంటూ మరోసారి తీవ్ర ఆవేదన చెందుతూ మాట్లాడింది నటి పూజిత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X