'పూల రంగడు' దర్శకుడు నెక్ట్స్ చిత్రం
'పూలరంగడు'తో హిట్ కొట్టిన వీరభద్రమ్ తన తదుపరి చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ చిత్రం టైటిల్ 'భాయ్'."ఎంటర్‌టైన్‌మెంట్‌తో చంపేస్తాడు..అనేది ఆ సినిమా ట్యాగ్‌లైన్. ఇక 'భాయ్'కి వీరభద్రమ్ గత రెండు చిత్రాలకు రచన చేసిన శ్రీధర్ సీపాన రచయితగా చేస్తున్నారు. ఆయనే ఈ ప్రాజెక్టుని విషయం మీడియాకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు నాగార్జునతో తెరకెక్కనున్నట్లు సమాచారం.
ఇక పూల రంగడులోని 'దబాంగ్ దబాంగ్ అంటే దొబ్బేయ్ దొబ్బేయ్ అంటున్నాడ్రా'... 'జిందగీ నా మిలేగా దుబారా అంటే ఏమంటున్నాడ్రా?'... 'దమ్ముంటే దుబాయ్ రమ్మంటున్నాడ్రా' అనే డైలాగులుకు మంచి స్పందన వస్తోంది. దాంతో అతనికీ బయిట ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే వీరభధ్రమ్ కి సైతం వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారే తమ తదుపరి చిత్రాన్ని సైతం డైరక్ట్ చేయమని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
రామ్ తో ఆ చిత్రం ఉండే అవకాసం ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే మరి రామ్ తో ఈ భాయ్ చిత్రం చేస్తారా లేక నాగార్జునతో చేస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











