సునీల్ ‘పూల రంగడు’ అర్ధ సెంచరీ..
సునీల్ హీరోగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి వీరభద్రం దర్శకత్వంలో నిర్మించిన 'పూల రంగడు' దిగ్విజయంగా ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ విషయమై నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ '' మా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బేనర్‌లో సంక్రాంతికి 'బిజినెస్‌మేన్' వంటి సూపర్ హిట్ చిత్రం రాగా, మహా శివరాత్రి కానుకగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మా మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బేనర్‌లో సునీల్ హీరోగా వచ్చిన 'పూల రంగడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్ర విజయానికి సునీల్ సిక్స్ ప్యాక్, అనూప్ మ్యూజిక్ బాగా ప్లస్సయ్యాయి. 'ప్రేమ కావాలి' తర్వాత 'పూల రంగడు' చిత్రం కూడా మా బేనర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చారు.
సునీల్, ఇషా చావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్ గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, వేణు గోపాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్చూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్. ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్త మురళీ కృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్ ఆర్ మూవీ మేకర్స్, నిర్మాత: అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రం.
ప్రస్తుతం సునీల్ దేవిప్రసాద్ దర్శకత్వంలో 'రాధా కృష్ణుడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'కు రీమేక్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో పూల రంగడు హీరోయిన్ ఇషా ఛావ్లా నటిస్తోంది. దేవీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్, పారస్ జైన్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











