twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ కు రియల్‌ ఎస్టేట్ కష్టాలు

    By Srikanya
    |

    Poola Rangadu
    సునీల్ త్వరలో రియల్ ఎస్టేట్ కష్టాలు ఎదుర్కోబోతున్నాడు. అయితే అవి నిజ జీవితంలో కాదు..వెండి తెరపైన. సునీల్ తాజా చిత్రం 'పూలరంగడు'లో అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా చేస్తూంటాడు. అందులో అతని పాత్ర పేరు రంగా. ఈ విషయం చెప్తూ నిర్మాత అచ్చిరెడ్డి...పావలాకి స్థలం కొని, పాతిక వేలుకి అమ్మేద్దామని.. అలా అలా కోట్లు కూడబెట్టేద్దామని.. రంగా ఆలోచిస్తాడు అందుకే రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెడతాడు. ఆ మరుక్షణమే బూమ్‌ తగ్గిపోయింది. ఆస్తులు పోయి.. అప్పులు మిగిలాయి. ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి మరో ఆలోచన చేశాడు. ఇంతకీ అదేంటి? అతగాడి ఇక్కట్లు తీరాయా? లేదా? ఈ సంగతులు తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.

    మరో ప్రక్క'పూలరంగడు'ఓ మళయాళ చిత్రానికి కాపీ అంటూ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.వారు చెప్పే దాని ప్రకారం..మళయాళ కామిడీ హీరో దిలీప్ నటించిన 'పండిప్పడ'అనే ఈ చిత్రం 2005 లో వచ్చింది. నవ్య నాయిర్,ప్రకాష్ రాజు,రాజన్ పి.దేవ్ నటించిన ఈ చిత్రం అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. దిలీజ్ కున్న ఇమేజ్ తో ఓపినింగ్స్ తెచ్చుకోగలిగినా ఈ చిత్రం పెద్దగా ప్రేక్షదారణ పొందలేదు.

    స్లాఫ్ స్టిక్ కామిడీతో నడిచే ఈ చిత్రం ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ లో తిరిగే హీరో తనకున్న అప్పులు తీర్చుకోవటం కోసం ఓ మారు మూల గ్రామంలో ఉన్న తన ఆస్ధి అయిన చిన్న స్ధలాన్ని అమ్మకోవటానికి బయిలు దేరతాడు. అయితే ఆ భూమి ఇద్దరు భూస్వామిలు మధ్య నలుగుతూంటుంది. వీరిద్దరకీ సమన్వయం కుదిర్చి ఆ భూమిని అమ్మటానికి ఆ గ్రూప్ లో ఒకదాంట్లో జాయిన్ అవుతాడు. అంతేగాక ఆ భూస్వామిలో ఒకరి కూతురు తో ప్రేమలో కూడా పడతాడు. మరో ప్రక్క ఆమెను పెళ్లి చేసుకోవాలని రైవల్ గ్రూప్ భూస్వామి కోరుకుంటూంటాడు. వీళ్లిద్దరు మధ్యా హీరో నలిగిపోతూ ఎలా తన సమస్యను తీర్చుకున్నాడనేది మిగతా కథ.

    జనవరి 5న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, కూర్పు: గౌతంరాజు, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీ మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.

    English summary
    Sunil next outing Poola rangadu joined the race of sankranthi releases list. The film which is directed by Veerabhadram is produced by Atchi reddy under Macs india Production banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X