‘పూల రంగడు’ ఫుల్ స్టోరీ
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు రంగ(సునీల్). ఎలాంటి భూమినైనా చిటికెలో అమ్మేయగల గటికుడు. వరంగల్ జిల్లా పరకాలలో దుబాయ్ కి చెందిన వ్యక్తికి 30 ఎకరాల భూమి ఉంటుంది. దాన్ని అమ్ముకుందామంటే... ఆ ఊర్లో ఉండే ఇద్దరు విలన్స్ కొండారెడ్డి(దేవ్ గిల్), లాలాగౌడ్(ప్రదీప్ రావత్) భూమిని ఎవరూ కొనకుండా వచ్చిన వాళ్లను వచ్చినట్లు చంపేస్తుంటారు. దీంతో ప్రమాదం విషయాన్ని దాచి ఆ భూమిని తక్కువ ధరకే రంగకు అమ్ముతారు దాని యజమాని. ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఆ భూమిని కొన్న రంగ...ఆ ఇద్దరు విలన్ల గురించి తెలుసుకుని ఖంగుతింటాడు. ఎలాగైనా ఆభూమిని దక్కించుకోవడానికి తన స్నేహితుడు అలీ ద్వారా తొలుత కొండారెడ్డి దగ్గర పనికి చేరుతాడు. అతని మనసు మార్చే ప్రయత్నం చేయడంతో పాటు మరో విలన్ లాలాగౌడ్ కూతురు అనిత(ఇషా చావ్లా) ప్రేమలోకి దింపి...తద్వారా ఆ భూమిని అమ్మేసుకోవాలనే ప్లాన్ తో ఉంటాడు రంగ.
వాస్తవానికి ఈ ఇద్దరు విలన్లకు ఒకరంటే ఒకరికి పడదు. కొండారెడ్డి చిన్నతనంలో ఉండగా....వారి ఇంట్లో పని చేసే లాలాగౌడ్ అతని అక్కను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణం. ఇలా రెండు కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న రంగ... కొండరెడ్డికి, లాలాగౌడ్ కూతురు అనితకు పెళ్లి చేసి ఇరు కుటుంబాలను కలిపి, తన భూమిని అమ్మేసుకుని వెలుదామనే మరో ప్లాన్ వేస్తాడు. అయితే అనిత రంగను ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తుంది. దీంతో ఏం చేయాలనేదానిపై ఆలోచిస్తుండగా అసలు విషయం ఆ ఇద్దరు విలన్లకు తెలిసి పోతుంది.
దీంతో రంగను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు రంగ. కొండారెడ్డి అనితను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. దీంతో రంగ రంగంలోకి దిగడంతో సినిమా క్లయిమాక్స్ కు చేరుతుంది. చివరి ఫైట్ లో సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్ చేస్తాడు. అనితను దక్కించుకోవడంతో పాటు భూమిని అమ్మేసుకుంటాడు. కథ సుఖాంతం అవుతుంది.


Click it and Unblock the Notifications











