సునీల్ 'పూల రంగడు' విడుదల తేదీ ఖరారు
సునీల్ హీరోగా నటిస్తున్న పూల రంగడు చిత్రం జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే ఆడియోని జనవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సునీల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా చేస్తూంటాడు. అందులో అతని పాత్ర పేరు రంగా. పావలాకి స్థలం కొని, పాతిక వేలుకి అమ్మేద్దామని.. అలా అలా కోట్లు కూడబెట్టేద్దామని.. రంగా ఆలోచిస్తాడు అందుకే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడతాడు. ఆ మరుక్షణమే బూమ్ తగ్గిపోయింది. ఆస్తులు పోయి.. అప్పులు మిగిలాయి. ఆ కష్టాల నుంచి గట్టెక్కడానికి మరో ఆలోచన చేశాడు. ఇంతకీ అదేంటి? అతగాడి ఇక్కట్లు తీరాయా? లేదా? ఈ సంగతులు తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే.
స్లాఫ్ స్టిక్ కామిడీతో నడిచే ఈ చిత్రం ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ లో తిరిగే హీరో తనకున్న అప్పులు తీర్చుకోవటం కోసం ఓ మారు మూల గ్రామంలో ఉన్న తన ఆస్ధి అయిన చిన్న స్ధలాన్ని అమ్మకోవటానికి బయిలు దేరతాడు. అయితే ఆ భూమి ఇద్దరు భూస్వామిలు మధ్య నలుగుతూంటుంది. వీరిద్దరకీ సమన్వయం కుదిర్చి ఆ భూమిని అమ్మటానికి ఆ గ్రూప్ లో ఒకదాంట్లో జాయిన్ అవుతాడు. అంతేగాక ఆ భూస్వామిలో ఒకరి కూతురు తో ప్రేమలో కూడా పడతాడు. మరో ప్రక్క ఆమెను పెళ్లి చేసుకోవాలని రైవల్ గ్రూప్ భూస్వామి కోరుకుంటూంటాడు. వీళ్లిద్దరు మధ్యా హీరో నలిగిపోతూ ఎలా తన సమస్యను తీర్చుకున్నాడనేది మిగతా కథ.
జనవరి 5న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, కూర్పు: గౌతంరాజు, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీ మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.


Click it and Unblock the Notifications











