మహేష్, వెంకీ, రవితేజ ధాటికి..సునీల్ వెనకడుగు!
కమెడియన్ నుంచి హీరోగా గర్న్ అయిన సునీల్ తాజాగా పూల రంగడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సునీల్ కెరియర్లోనే అత్యంత ఎక్కవ ప్రింట్లతో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారి ఈ సినిమా విడుదలను ఫిబ్రవరి 2కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో బాలీవుడ్ టాప్ హీరో మహేష్ నటించిన బిజినెస్ మ్యాన్, వెంకటేష్ నటించి బాడీగార్డ్, రవితేజ నటించిన నిప్పు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ టఫ్ కాంపిటీషన్లో థియేటర్ల సమస్య ఏర్పడటంతో దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సనీల్, ఇషా చావ్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మర్యాద రామన్న సినిమాతో హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న సునీల్...ఈ చిత్రం ద్వారా సిక్స్ ప్యాక్ బాడీతో పూర్తి స్థాయి హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన సునీల్ సిక్స్ ప్యాక్ బాడీ ఇతర టాప్ హీరోలకు ధీటుగా ఉండటమే ఇందుకు కారణం.


Click it and Unblock the Notifications











