సన్నీలియోన్‌ను మించిపోయిన బికినీ పాప
పెద్దలకు మాత్రమే పరిమితం అయిన శృంగార చిత్రాల ఫారిన్ తార సన్నీలియోన్‌ను మన దేశీ బికినీ పాప పూనమ్ పాండే మించి పోయింది. సన్నీ లియోన్‌లా న్యూడ్‌గా ఫోజులు ఇవ్వడంతో పాటు, చిట్టిపొట్టి బికినీలు వేసి కుర్రకారుకు మత్తెక్కించడంలో బాగా ముదిరి పోయిన పూనమ్ తాజాగా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో సన్నీని బీట్ చేసింది.
పూనమ్ పాండేకి ట్విట్టర్లో 2,41, 959 మంది పాలోవర్స్ ఉండగా.....సన్నీ లియోన్ ఫాలోవర్స్ సంఖ్య 2,30, 109 మాత్రమేనట. దీంతో సన్నీకంటే తనకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని తెగ సంబర పడిపోతోంది పూనమ్ పాండే. వీళ్ల రికార్డుల సంగతి అటుంచితే వీళ్ల ఎక్స్ ఫోజింగ్ ఆగడాలకు అంతులేకుండా పోతోందని సంప్రదాయ వాదులు మండి పడుతున్నారు.
ఏదో కారణం చేత ఈ హాట్ భామలు ఇద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలో షారుఖ్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంతో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా పూనమ్ పాండే నగ్నంగా ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని ట్విట్టర్లో చేరిన సందర్భంతో పాటు ప్రతి సందర్భంలోనూ పూనమ్ బికీనీలు వేసి చేసే హడావుడి గురించి తెలిసిందే.
సన్నీ లియోన్ ప్రస్తుతం 'జిస్మ్ 2' చిత్రంలో నటిస్తోంది. పూజాభట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో యూత్‌కు మత్తెక్కించే మషాలా బాగా దట్టించి రూపొందిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచడంలో భాగా చిత్రం దర్శక నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తొలుత ఈచిత్రంలోని నటీనటుల కాస్టూమ్స్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలంలో సన్నీ లియోన్ లోదుస్తులు కూడా వేలానికి పెట్టనున్నారట. బ్లూఫిల్మ్ తార కాబట్టి ఆమె లోదుస్తులు దక్కించుకోవడానికి శృంగార ప్రియులు పోటీ పడతారని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











