Just In
Don't Miss!
- Sports
గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మ నోట బూతులు.. వీడియో వైరల్!
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- News
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు... డివిజన్ బెంచ్‌లో ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్..
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎంతో పోరాడుదామని అనుకున్నా.. కానీ విధి మాత్రం అలా చేసింది : పూనమ్ కౌర్
కొందరు సెలెబ్రిటీలు సినిమాలతో ఫేమస్ అవుతుంటారు. ఇంకొందరు వివాదాలతో క్రేజ్ తెచ్చుకుంటారు. పూనమ్ కౌర్ సినిమాలతో ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకున్నా.. పవన్ కళ్యాణ్ వ్యవహారం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గుర్తింపు లభించింది. ఆ మధ్య కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరిగిన వార్‌లో పూనమ్ కౌర్ పేరు, ఆడియోలు బయటకు వచ్చాయి. అలా పూనమ్ కౌర్ తెరపైకి వచ్చింది.

పవన్ కళ్యాణ్‌పై పోస్ట్‌లు..
పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్‌పై పరోక్ష పోస్ట్‌లు చేస్తుంది. అది పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి అని అందరికీ అర్థం అవుతుంది. కానీ ఏనాడూ కూడా పేర్లను వాడలేదు. ఆమె చేసే పోస్ట్‌లో కొన్ని సార్లు పవన్ కళ్యాణ్‌ను వెక్కిరించినట్టు ఉంటాయి. ఇంకొన్ని సార్లు పొగిడినట్టుంటాయి. బెత్తం దెబ్బలు అంటూ, పవర్ ఫుల్ నాయకుడు అంటూ ఇలా ఏవేవో ట్వీట్లు వేస్తుంటుంది.

గురూజీ అంటూ..
ఇక పూనమ్ కౌర్ గురూజీ అంటూ ఆ మధ్య షేర్ చేసిన ట్వీట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఓ పెద్ద డైరెక్టర్ తనను ఎలా బాధపెట్టాడో చెప్పుకొచ్చింది. దాసరి నారాయణ రావును తలుచుకుంటూ ఆమె చేసిన పోస్ట్‌లు బాగానే వైరల్ అయ్యాయి. ఆ మధ్య డిప్రెషన్ గురించి మాట్లాడుతూ.. తన లైఫ్‌లోనూ అలాంటి ఘటనలు ఎదురయ్యాయని వాటిన అధిగమించానని చెప్పుకొచ్చింది.

సుశాంత్ సింగ్‌పై..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ సుశాంత్ సింగ్ కేసులోనూ సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో జరిగే మోసాలపైనా గొంతు విప్పింది. మొన్నామధ్య అర్నబ్ అరెస్ట్, బెయిల్‌పై విడుదల, కంగనా రనౌత్ సోదురుడి వివాహాం ఇలా అన్నింటిపై స్పందిస్తూ.. వారంతా హ్యాపీగానే ఉన్నారు.. కానీ సుశాంత్ చనిపోవడానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు అని కౌంటర్ వేసింది.

తాజాగా అలా..
తాజాగా పూనమ్ ఓ ట్వీట్ చేసింది. ఈ రోజు జాతీయ న్యాయదినోత్సవమని చెబుతూ.. నేను ఓ న్యాయవాదిని అయి ఎంతో పోరాడుదామని అనుకున్నాను కానీ ఏది నెరవేరలేదు.. ఎందుకంటే విధికి తెలుసు ఏం చేయాలో.. అది ఏమనుకుంటే అదే జరుగుతుందని నిరాశగా చెప్పుకొచ్చింది.