twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్‌పై నెగెటివ్ ట్రెండ్.. మధ్యలో పూనమ్ కౌర్ ఎంట్రీ .. పవన్ కళ్యాణ్‌పై అలా!

    |

    పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై నిన్న జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సాయంత్రం వరకు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ అంతా హోరెత్తిపోయింది. అదే కాసేపటికి మరోలా ట్రెండ్ అయింది. వకీల్ సాబ్ డిజాస్టర్ అంటూ కొన్ని సీన్లను ట్రోల్ చేసి పడేశారు. అలా వకీల్ సాబ్ మీద వెంటనే నెగెటివ్ ట్రెండ్ ప్రచారం కావడంలో వైఎస్ జగన్ అభిమానులతో పాటు ఇతర హీరోల ఫాలోవర్లు సైతం ఉన్నారని తెలుస్తోంది.

     బ్లాక్ బస్టర్ టాక్..

    బ్లాక్ బస్టర్ టాక్..

    మామూలుగా అయితే నిన్న ఉదయం నుంచి బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలతో రచ్చ రచ్చగా మారింది. ఎక్కడ చూసినా వకీల్ సాబ్ హల్చల్ కనిపించింది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రమంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేశారు. అభిమానులతో పాటు సెలెబ్రిటీలు సైతం వకీల్ సాబ్‌ను కొనియాడారు.

     నెగెటివ్ ట్రెండ్..

    నెగెటివ్ ట్రెండ్..

    బ్లాక్ బస్టర్ అయిన వకీల్ సాబ్ మీద కొందరు పని గట్టుకుని నెగెటివ్ ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇందులో వైఎస్ జగన్ అభిమానులున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం వకీల్ సాబ్ మీద నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసినట్టు కనిపిస్తోంది. రికార్డుల విషయాలు మాట్లాడుకుంటూ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు.

     మధ్యలో పూనమ్ ఎంట్రీ..

    మధ్యలో పూనమ్ ఎంట్రీ..

    ఇక నిన్న జరిగిన ఈ రచ్చలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. మామూలుగా పూనమ్ కౌర్ ఎలాంటి ట్వీట్లు వేస్తుందో అందరికీ తెలిసిందే. అవి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేలా ఉంటాయా? లేదా? మద్దతు పలుకుతున్నట్టు ఉంటాయా? అన్నది క్లారిటీగాచెప్పలేం.

    పూనమ్ కౌర్ పేరిట..

    పూనమ్ కౌర్ పేరిట..

    అయితే నిన్న కొన్ని ట్వీట్లు పూనమ్ కౌర్ వేసినట్టుగా ప్రచారంలోకి వచ్చాయి. అందులో పవన్ కళ్యాణ్‌ను దారుణంగా ట్రోల్ చేసినట్టుంది. మంచి సినిమాలు చేస్తే.. మంచి పాత్రలు పోషిస్తే.. లోపల ఉన్న లక్షణాలు పోతాయా? అని చేసిన కర్మ ఊరికే పోతుందా? అని రకరకాలు ట్వీట్లు వేసింది. కానీ అవి తాను వేయలేదని అవన్నీ ఫేక్ అని పూనమ్ క్లారిటీ ఇచ్చింది.

    Recommended Video

    Liger : Vijay Deverakonda, Ananya Panday's Liger Gets Release Date
    కుళ్లు రాజకీయాలు..

    కుళ్లు రాజకీయాలు..

    వకీల్ సాబ్ సినిమా మీద నెగెటివ్ ట్రెండ్ చేయడంపై పూనమ్ కౌర్ స్పందిస్తూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్ళు రాజకీయాలు? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా మరో ట్వీట్ వేస్తూ.. సినిమా - రాజకీయాల మధ్య సంబంధం అనేది ప్రజలకు ఉపయోగపడాలి. . సినిమా- రాజకీయం కలిసి కాపురం చెయ్యకపోతే ఫీల్ అయ్యేది మాత్రం చూస్తున్న జనాలు. అందుకే కుళ్లు రాజకీయాలు మానేయాలి అని చెప్పుకొచ్చింది.

    English summary
    Poonam kaur About Pawan kalyan And vakeel saab,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X