ఇన్నాళ్లూ అది మిస్ అయ్యాం.. మెగా హీరో సినిమాపై పూనమ్ కౌర్ వెరైటీ ట్వీట్
పూనమ్ కౌర్ ఎప్పుడు ఎలాంటి ట్వీట్ వేస్తుందో చెప్పలేం. అందులో ఎలాంటి అర్థాలు ఉంటాయి.. ఎవరిని కించపరుస్తుంది.. ఎవరిపైన సెటైర్ వేసిందో కచ్చితంగా చెప్పలేం. పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అనే ఈ టాపిక్ ఎప్పటికీ అంతుచిక్కని ఓ బేతాళ ప్రశ్నలానే ఉంటుంది. ఆ మధ్య మీడియా ముందుకు వచ్చిన పూనమ్ ఓ స్టార్ డైరెక్టర్‌పై కామెంట్లు చేసింది. గురూజీ అంటే నేరుగా ట్వీట్లు వేస్తూ సెటైర్లు వేసింది. అలా ఎప్పుడు ఎలాంటి ట్వీట్లు వేస్తుందో తెలియని పూనమ్ కౌర్ తాజాగా ఉప్పెన సినిమా మీద ట్వీట్ వేసింది.

ఉప్పెన జోరు..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, సోషలో మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఉప్పెన జోరు కనిపిస్తోంది. రేపు విడుదల కాబోతోన్న ఈ మూవీ గురించి విపరీతంగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అయితే ఇప్పటికే ఆడియో, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం..
ఉప్పెన సినిమాపై ఇంతటి హైప్ క్రియేట్ అవ్వడానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతమే ముఖ్య కారణం. విడుదల చేస్తూ వచ్చిన ప్రతీ పాట బాగానే క్లిక్ అయింది. అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాయి. నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అనే పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రంగులద్దుకున్నా, జల జల పాతం అనే రొమాంటిక్ పాటలు కూడా వైరల్ అయ్యాయి.

తాజాగా పూనమ్ కౌర్..
తాజాగా పూనమ్ కౌర్ ఉప్పెన సినిమాపై స్పందించింది. తనకు నచ్చిన పాట అంటూ చెప్పుకొచ్చింది. అన్నింట్లోకెల్లా జల జల జలపాతం అనే పాట ఎక్కువగా నచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉప్పెన టీంకు స్పెషల్ విషెస్ అందించింది.

అది మిస్ అయ్యాం..
వాలెంటైన్స్ లవ్.. ఉప్పెన సంగీతం అన్నీ కలిపి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించాలి.. ఎంతో కాలం నుంచి ప్రేమను పంచుదాం.. ఇన్నాళ్లు మిస్ అయిన పాజిటివిటీని పంచుదామని ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు ఉప్పెన దారి చూపేలా ఉంది. ఉప్పెన టీం అందరికీ శక్తి లభించాలంటూ పూనమ్ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











