»   »  పూనమ్ కౌర్ మళ్ళీ వస్తోంది

పూనమ్ కౌర్ మళ్ళీ వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Poonam Kaur
మిస్ ఆంధ్రా టైటిల్ తో సినిమా వారిని ఆకట్టుకున్న అచ్చ తెలుగు అందం పూనమ్ కౌర్. దీపగా పేరు మార్చుకున్న ఈ వయ్యారిని మాయాజాలంతో యస్వీ కృష్ణా రెడ్డి హీరోయిన్ ని చేసాడు. అది వర్కవుట్ కాకపోవటంతో ఆమె మేజిక్ ఎవరినీ తాకలేదు. తర్వాత తేజ ఒక విచిత్రంతో మళ్ళీ ఆమెను తెర ముందుకు తెచ్చాడు. దాంతో సదాలా టాప్ హీరోయిన్ అయ్యే అవకాశం వచ్చిందని ఆశ పడ్డ ఆమెకు ఇదీ నిరాశనే మిగిల్చింది. ముచ్చటగా మూడోసారి నీరజ్ అండ్ నిక్కి అంటూ ముందుకొచ్చింది. కాని చిత్రంగా ఈ సినిమాకూడా మొదటి రెండింటి దారినే పట్టింది. ఇక తనని సెంటిమెంట్లు ఎక్కువైన తెలుగులో అసలు ఎవరూ పట్టించుకోరని అర్దం చేసుకుని కన్నడ పరిశ్రమకు వలస వెళ్ళింది. అక్కడ రాజ్ కుమార్, రవి చంద్రన్ వంటి పాపులర్ హీరోలతో హిట్టులు కొట్టింది. నిలదొక్కింది. దాంతో మళ్ళీ ఆమెకు తెలుగు సినిమాలపై ఆశలు ప్రారంభమయ్యాయి.ఇక్కడకి వచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. అక్కడ హీరోయిన్లు సంజన (మొగుడు పెళ్ళా ఓ బోయ్ ప్రెండ్ ఫేమ్) వంటి వారు ఇక్కడ బుజ్జిగాడు మేడిన్ చెన్నై వంటి సినిమాల్లో బుక్కై నిలదొక్కుకునే ప్రయత్నాలు చేయటం ఆమెను ఈ దిశగా ప్రేరేపిస్తున్నాయి.ఇప్పుడు తన స్వస్దలమైన హైదరాబాద్ లో మకాం వేసి తన పి.ఆర్.వో.ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. బెస్ట్ ఆఫ్ లక్ దీప

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X