త్రివిక్రమ్‌పై ఫిర్యాదు.. పూనమ్ కౌర్‌కు తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఒకవైపు కొనసాగుతుండగానే.. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరో బాంబు పేల్చింది. గురూజీ త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోరా? అంటూ ట్వీట్స్ చేసింది. అయితే జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉన్న సెక్సువల్ హరాష్‌మెంట్ రెడ్రస్సల్ ప్యానెల్ మీడియా సమావేశంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. అయితే ఆయన పూనమ్ చేసిన డిమాండ్ గురించి మాట్లాడుతూ..

జానీ మాస్టర్ లైంగిక దాడి కేసు నేపథ్యంలో ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు మా అసోసియేషన్ చర్యలు తీసుకొంటే.. నాలాంటి వాళ్లకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేవి కాదు. నేను కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిక్రమ్‌ను ఈ నా వ్యవహారంపై సినీ పెద్దలు ప్రశ్నించాలి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Poonam Kaur complaint on Trivikram Srinivas Tammareddy Bhardwaja strong Reaction here

అయితే పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌ మీడియాలోను, సినీ వర్గాల్లోను భారీ చర్చకు దారి తీసింది. అప్పుడప్పుడు ఈమె ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడం ఎందుకు? తనకు ఏదైనా అన్యాయం జరిగితే.. లిఖిత పూర్వకంగా ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా పోలీసులకు తనకు చేసిన మోసానికి ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందనే కామెంట్స్ వినిపించింది.

ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడం వల్ల నీకు న్యాయం జరుగుతుందా? నీకు నిజంగా అన్యాయం జరిగితే చట్టాలు, కోర్టులు, సినీ సంఘాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేసినట్టు నీ వద్ద ఏదైనా రుజువు ఉందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని టాలీవుడ్‌లో వేధింపుల నిర్మూలన, పరిష్కార కమిటీ సభ్యుడు తమ్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

Poonam Kaur complaint on Trivikram Srinivas Tammareddy Bhardwaja strong Reaction here

అయితే ఈ వ్యవహారంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.. నాకు తెలియదు. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఎందుకు ఇచ్చారు. మా కమిటీలో ఉన్న ఎర్ర డబ్బాలో ఫిర్యాదు వేసి ఉంటే స్పందించే వాళ్లం. పని జరిగేది. ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకోలేం. ఒకవేళ మా సంఘం వారికి ఫిర్యాదు ఇస్తే.. వారు మాకు ఫార్వర్డ్ చేస్తే పరిశీలించే వాళ్లం. ఇప్పటికైనా కంప్లయింట్ చేస్తే మీ చర్యలు తీసుకొంటాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X