పవన్ కళ్యాణ్, నికీషా పటేల్ హాట్ ఇష్యూ.. ఎంటరైన పూనమ్ కౌర్.. సెన్సేషనల్ కామెంట్
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా అంతా ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోయింది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా.. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పవన్‌కి హీరోయిన్ నికీషా పటేల్ చెప్పిన విషెస్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ హాట్ ఇష్యూలోకి పూనమ్ కౌర్ ఎంటర్ కావడం ఆశ్చర్యపర్చింది. ఇంతకీ పూనమ్ ఎందుకు ఎంటరైంది? ఆమె కామెంట్ ఏంటి? వివరాల్లోకి పోతే..

48వ పడిలోకి పవన్.. ట్రెండింగ్
పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెట్టిన సందర్బంగా సెప్టెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం.. సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం.. పవన్ డీపీలు, ఫ్లెక్సీలు ఇలా రచ్చ రచ్చ చేసేశారు. దీంతో పవన్ బర్త్ డే కాస్తా ట్రెండింగ్‌గా మారి పోయింది.
పావలా కల్యాణ్ అంటూ హీరోయిన్ నికీషా ట్వీట్
ఈ నేపథ్యంలో ‘కొమరం పులి' సినిమాలో పవన్ సరసన నటించిన నికిషా పటేల్ పొరపాటున ఓ ట్వీట్ చేసి విమర్శల పాలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న పలు హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అందులో #HappyBirthdayPawalaKalyan అని తప్పుగా ఓ ట్యాగ్ జత చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ తర్వాత ఏం చేసిందంటే...
పావలా కల్యాణ్ అని ఉన్న ట్యాగ్ చూసిన పవన్ ఫ్యాన్స్ నికిషా పటేల్ పై విరుచుకు పడ్డారు. దీంతో పొరపాటును గ్రహించిన నికీషా.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి ‘ఎవరైనా హర్ట్ అయితే సారీ.. తప్పును సరిదిద్దుకున్నా. హ్యాపీ గణేషా.. #PSPK #pawankalyan' అంటూ మరో ట్వీట్ చేసింది. దీంతో దీనికి ఈ ఇష్యూకి పుల్‌స్టాప్ పడింది.

ఎంటరైన పూనమ్ కౌర్.. సెన్సేషనల్ కామెంట్
అంతా ఓకే అనుకున్న ఈ తరుణంలో మరో హీరోయిన్ పూనమ్ కౌర్ ఈ ఇష్యూలో ఎంటరై ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'నికీషా వదిలేయ్.. ఎవరి కోసమో నువ్వు నీ నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నీకు మీడియా వల్ల ఇబ్బందులు ఎదురై నీ కెరీర్ పై ఎఫెక్ట్ చూపాయి. ఈ ఇష్యూని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు' అని పూనమ్ కౌర్ తెలిపింది. దీంతో మరోసారి ఈ ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











