సగం చూపించండి.. మీ కర్మ మొత్తం పోతుంది.. పూనమ్ కౌర్ ఫైర్
విశాఖపట్నం ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఎల్‌జీ పాలిమర్స్ నుంచి విష వాయువు లీకైన దుర్ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు జాతీయ స్థాయిలో అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. విశాఖ ఘటనపై టాలీవుడ్ మొత్తం స్పందించింది. తాజాగా పూనమ్ కౌర్ ఈ ఘటనపై స్పందిస్తూ రాజకీయ నాయకులపై ఫైర్ అయింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

కదిలిన టాలీవుడ్..
మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్, నారా రోహిత్, కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మంచు విష్ణు ఇలా ప్రతీ ఒక్కరూ స్పందించారు. ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ నష్టపరిహారం..
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారికి, గాయపడిన వారికి, చికిత్స అందుకుంటున్న వారందరికీ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. చుట్టు పక్కల ఉన్న గ్రామాలందరికీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. తాజాగా పూనమ్ కౌర్ విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందిస్తూ రాజకీయ నాయకులను ఏకి పారేసింది.

కర్మలన్నీ తొలగిపోతాయి..
పూనమ్ కౌర్ విశాఖ ఘటనను ఉద్దేశిస్తూ.. ‘రాజకీయ నాయకులమని చెప్పుకునే సో కాల్డ్ వ్యక్తులు.. పేద, ధనిక, కరప్ట్ అయిన, కరెప్ట్ కాని, నిజాయితీ గల వారు, ద్వేషపూరితమైన ప్రతీ ఒక్క నాయకులు కలిసి రండి.. రాష్ట్రాన్ని కాపాడండి. చెత్త ఎన్నికల్లో మీరు పెట్టే శ్రమలో సగం ఇప్పుడు పెట్టండి.. మీరు చేసిన కర్మలన్నీ తొలగిపోతాయ'ని చెప్పుకొచ్చింది.
Recommended Video

మీ అవసరముంది..
మరో ట్వీట్‌లో.. ‘ప్రియమైన నాయకులారా.. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు బయటకు రండి.. మీకు అవసరమున్నప్పుడే కాదు.. సమయం ఇదే.. మీ డబ్బు, ఇళ్లు, ఫామ్స్, మీ భద్రతే రాష్ట్రానికి కావాలా? విశాఖ ఘటన దృశ్యాలు చూస్తే ఎంత బాధగా ఉందో తెలుస్తోందా? తల్లి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తలదాచుకోవడానికి పరుగెత్తుతోంది. ప్రజలకు మీ అవసరం ఇప్పుడు ఉంది.. ప్రజల కోసం పోరాడండ'ని సూచించింది.


Click it and Unblock the Notifications











