మరో మారు పరోక్షంగా కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్!
నటి పూనమ్ కౌర్ మరో మారు పరోక్ష వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. ఆ మద్యన నర్మగర్భంగా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్స్ సంచనలం సృష్టించాయి. తాజగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ అదే తరహాలో ఉందని నెటిజన్లు అంటున్నారు.
రెక్కలు విరిగిన కొన్ని పక్షులకు మళ్ళీ కొత్తగా రెక్కలు వచ్చాయి. మరో అందమైన జర్నీ ప్రారంభించబోతున్నాయి. దుష్టశక్తుల ఆలోచనలు కూడా వారిపై పడకూడదు. ఇలాంటి దృశ్యాన్ని చూస్తున్నందుకు మహిళగా సంతోషిస్తున్నానని అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

పూనమ్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇటీవల రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ని ఉద్దేశించి పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేసిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











