Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Poonam Kaur: పవన్ తో నటించకుండా అడ్డుకున్నారు.. చెప్పినా చెప్పకున్నా ప్రాబ్లమే అంటూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఔత్సాహిక నటీనటులు, వర్ధమాన నటినటులు కూడా పవర్ స్టార్ క్రేజ్ వాడుకొని సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పూనమ్ కౌర్ పరోక్షంగా కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ ఆమె నేరుగా పవన్ గురించి ప్రస్తావించిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో పవన్ తో కొన్ని సినిమాల్లో నటించిన ఆమె తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

స్క్రీన్ షాట్
పీకే లవ్ అనే పేరుతో పూనం కౌర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమెకు ఉన్న బంధం గురించి ఎవరికీ ఏమీ తెలియదు కానీ తమ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని సంకేతాలు పంపే విధంగా ఆమె సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఎప్పటి సంగతో ఎందుకు ఈ మధ్య భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయిన రోజు అక్క బావ సినిమా హిట్టు అంటూ ఎవరో ఒక వ్యక్తి తనకు పంపిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఆమె రచ్చ రేపింది.

సెలక్టివ్గా ఇంటర్వ్యూ
అయితే చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఆ ప్రమోషన్లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా తక్కువ మీడియా ఛానల్స్ కు ఆమె సెలక్టివ్గా ఇంటర్వ్యూ ఇస్తోంది.

పీకే లవ్ అంటే
అందులో ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు వచ్చాడు ఒక యాంకర్. పీకే లవ్ అంటే ఏమిటి అని అడగగానే పీకే అంటే నా పేరు పీ అంటే పూనమ్ కె అంటే కౌర్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

నటించాలని అనుకున్నా
ఆ తర్వాత సదరు యాంకర్ తన ఫోన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోని చూపించి ఆయన గురించి చెప్పమని అడిగితే పవర్ స్టార్ ఫోటో చూసిన తర్వాత సిగ్గుపడిపోయిన ఆమె ఆయన గురించి ఏదైనా చెప్పినా చెప్పకపోయినా తంటానే అని ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పను ఆయనతో నటించాలని అనుకున్నా కొంత మంది యాక్ట్ చేయడం లేదు ఇప్పుడు ఆయన గురించి ఏమి చెప్ప లేను అని పేర్కొన్నారు.

దేవుడా అంటూ
నేను ఆయన గురించి పాజిటివ్ చెప్పినా ప్రాబ్లమ్ అవుతుంది నెగిటివ్ చెప్పిన ప్రాబ్లం అవుతుంది అందుకే నేను చెప్పను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. పవన్ ఫోటో చూస్తేనే తనకు సిగ్గు వచ్చేస్తుంది అంటూ ఆమె టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడా అంటూ కామెంట్ చేసింది, ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.