దుమారం రేపిన పూనమ్ కౌర్..! ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఇంతకీ ఆ మెసేజ్ అర్థమేంటి?
సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఎవరి అభిప్రాయలు వారు స్వేచ్ఛగా పంచుకునే వెసులుబాటు వచ్చింది. ఓ సెలబ్రిటీ చేసిన విమర్శ అయినా, ప్రశంస అయినా.. అది అర్థమయ్యేలా చేసినా, అర్థం కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా చేసినా నెట్టింట వైరల్ అవుతుండటం చూస్తున్నాం. ఈ నేసథ్యంలోనే ఇటీవల పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఇది చూసి పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..

పూనమ్ కౌర్ ట్వీట్ సంచలనం
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్.. ఓ ట్వీట్ చేసింది. ఒక అబద్దాల కోరు ఎప్పుడూ రాజకీయ నాయకుడు గానే మిగిలిపోతాడు కానీ, నాయకుడు కాలేడని ట్వీట్‌లో పేర్కొంది పూనమ్. దీంతో ఈ ట్వీట్ చూసిన ఒక్కొక్కరూ ఒక్కేలా అర్థం చేసుకున్నారు. పూనమ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని టాక్ మొదలైంది.
విరుచుకుపడిన పవన్ ఫ్యాన్స్
జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా పూనమ్ కౌర్ ఇలా వ్యాఖ్యానించిందని అంటున్న పవన్ ఫ్యాన్స్.. అదే సోషల్ మీడియా వేదికగా ఆమెపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట సంచలనంగా మారడం, ఈ ఇష్యూ హాట్ టాపిక్ కావడం చకచకా జరిగిపోయాయి.
నా ఆలోచనల్లో నిజాలుంటాయి.. పూనమ్ క్లారిటీ
దీంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేసింది. తన ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయని, ఎదుటివారి ఆలోచనలన్నీ ఊహాగానాలే అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిపెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని, నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని అని తెలిపింది.
మీరంతా మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటి వారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్ అని పూనమ్ తెలిపింది.

ఇదంతా అనవసరం.. అదే మేలు
ఈ నేపథ్యంలో ఇష్యూ బాగా ముదరడం గమనించిన పవన్ ఫ్యాన్స్.. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఆమె పెడుతున్న ట్వీట్స్‌పై పెద్దగా స్పందించక పోవడమే మేలని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకా దూరం వెళుతుందా? లేక ఇక్కడితో స్టాప్ అవుతుందా? అనేది.

గతంలో పావలా కళ్యాణ్ ఇష్యూలో కూడా..
గతంలో పవన్ పుట్టిన రోజు నాడు పవన్ కళ్యాణ్ బదులుగా పావలా కళ్యాణ్ అంటూ నికిషా పటేల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన పొరపాటు తెలుసుకున్న నికిషా.. వెంటనే ఆ పొరపాటును సరిదిద్దుకుంది. ఆ టైమ్ లో కూడా పూనమ్ ఎంటరై.. ఈ ఇష్యూని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదని పేర్కొనడం షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











