అలాంటి వారితో పోరాడే శక్తిని ఇవ్వండి.. ప్రస్తుతం మీలాంటి వారే అవసరం.. ఎన్టీఆర్‌కు పూనమ్ కౌర్ నివాళి
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి, తెలుగు సినిమా ప్రపంచం గురించి ఎలుగెత్తి చాటి చెప్పారు. తెలుగు జాతి గురించి ప్రస్థావించాల్సి వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్ పేరు కచ్చితంగా పేర్కొనవల్సిందే. ఎందుకంటే తెలుగు భాషను, తెలుగు సినిమా ప్రపంచానికి ఓ గుర్తింపును తీసుకొచ్చి మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు. తెలుగు జాతి మొత్తం అందుకే ప్రేమగా అన్నగారు అని సంబోధించుకుంటుంది. అంతటి మహనీయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా యావత్ సినీ లోకం నివాళిని అర్పించింది.

వేడుకలకు దూరం..
లాక్ డౌన్ నిబంధనలకు విఘాతం కలిగించడం ఇష్టం లేక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లబోవడం లేదని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తాతను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ‘నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత' అని ట్వీట్ చేశాడు.

స్పందించిన టాలీవుడ్..
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ మొత్తం కదిలింది. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్ అని తేడా లేకుండా అందరూ స్పందించారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్ ఎన్టీఆర్‌తో నాడు దిగిన ఫోటోలను షేర్ చేశారు.

స్పందించిన పూనమ్ కౌర్..
పూనమ్ కౌర్ టాలీవుడ్ సినీ పెద్దల పట్ల ఎప్పుడూ తన విధేయతను చాటుకుంటూనే ఉంది. నాడు దాసరి జయంతి రోజున కూడా పూనమ్ స్పందించింది. తండ్రి వంటి వారని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. తాజాగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించింది.
Recommended Video

దుష్ట శక్తులతో పోరాడే శక్తి..
ఈ మేరకు ఎన్టీఆర్ ఘాట్‌కు వద్ద నివాళులు అర్పిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘తెలుగు సినిమా ప్రపంచానికి దేవుడు.. స్వర్గం నుంచి నన్ను ఆశీర్వదించండి.. దుష్ట శక్తులతో పోరాడే శక్తిని ఇవ్వండి.. మానవత్వం అన్నది కరువైన ఈ ప్రస్తుత సమయంలో మీలాంటి నాయకులు, మీలాంటి నటులే కావాలి' అంటూ పూనమ్ ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











