'కత్తి'కి పూనమ్ నుంచి అనూహ్య మద్దతు: 'నేను టార్గెట్ కాదలుచుకోలేదు'.. వెంటనే ట్వీట్ డిలీట్..

Recommended Video

పూనమ్ సూసైడ్ వెనుక నిజాలు ఇవేనట ! సోషల్ మీడియాలో వైరల్..!

పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ కత్తి విసిరిన సవాలుతో.. వివాదం క్లైమాక్స్‌కు చేరుకుందనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా వివాదం మరో మెట్టు ఎక్కింది. కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కత్తికి మద్దతుగా నిలవడం ఆశ్చర్యమే.

 పూనమ్ కౌర్ ట్వీట్:

పూనమ్ కౌర్ ట్వీట్:

'ఎవరైనా సరే, ఓ వ్యక్తి తల్లిని కించపరుస్తూ మాట్లాడకూడదు. నేను నిజాయితీగా అడుగుతున్నా.. దయచేసి కత్తి మహేష్ తల్లి గురించి మాట్లాడవద్దు' అంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం గమనార్హం.

 టార్గెట్ కాదలుచుకోలేదు..:

టార్గెట్ కాదలుచుకోలేదు..:

'వ్యక్తుల రహస్య ఎజెండాలకు రాజకీయంగా నేను టార్గెట్ కాదలుచుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి దీని గురించి చర్చించాలనుకుంటున్నాను' అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పూనమ్ మరో ట్వీట్ చేశారు.

 పవన్ గారు.. సహాయం చేయండి:

పవన్ గారు.. సహాయం చేయండి:

'గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారు.. ఇది నా కెరీర్, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు సహాయం చేయండి' అని పూనమ్ మరో ట్వీట్ చేశారు.

 ఆ వెంటనే డిలీట్..:

ఆ వెంటనే డిలీట్..:

పవన్ నుంచి సహాయాన్ని కోరుతూ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. ఆ వెంటనే వాటిని డిలీట్ చేయడం గమనార్హం. పూనమ్ ట్వీట్స్ డిలీట్ చేయడం కూడా ఇప్పుడు లేని చర్చకు తావిచ్చినట్లయింది.

 డిబేట్ నుంచి వాకౌట్..:

డిబేట్ నుంచి వాకౌట్..:

కత్తి మహేష్ తనపై ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో పూనం కౌర్ మహేష్ కత్తికి మద్దతుగా నిలవడం గమనార్హం. ఆదివారం ఓ టీవి చానెల్ డిబేట్‌లో కత్తితో పాటు కార్యక్రమంలో కూర్చొన్న ఓ వ్యక్తి.. 'మీ తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం.. చెప్పండి' అంటూ ఆయన్ను ప్రశ్నించారు. పదేపదే ఆ ప్రశ్న అడగడంతో.. సమాధానం చెప్పడానికి విముఖత వ్యక్తం చేసిన కత్తి.. డిబేట్ నుంచి వాకౌట్ చేశారు.

 మహేష్ తల్లి ప్రస్తావన..:

మహేష్ తల్లి ప్రస్తావన..:

టీవి డిబేట్‌లో మహేష్ కత్తి తల్లి గురించి ప్రస్తావించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ మహేష్ కత్తి తల్లి గురించి ప్రస్తావిస్తూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ట్వీట్ ఒకటి పూనమ్ దృష్టికి రావడంతో ఆమె ఈ అంశంపై స్పందించారు. ఏదేమైనా ఆయన తల్లి గురించి మాట్లాడటం పద్దతి కాదనే రీతిలో పూనం కౌర్ హుందాగా స్పందించారు.

 అంతకుముందు..:

అంతకుముందు..:

హీరోయిన్ పూనమ్ కౌర్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినందువల్ల.. తాను కూడా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పట్లేదని కత్తి మహేష్ ఆదివారం సంచలన ప్రశ్నలు లేవనెత్తారు.

ఆ ప్రశ్నలు ఆమె జీవితానికే మేలు చేస్తాయని కూడా అన్నారు. ఆ ఆరు ప్రశ్నలు పవన్ కల్యాణ్-పూనమ్ కౌర్ మధ్య సంబంధాన్ని, మధ్యలో త్రివిక్రమ్ ప్రమేయాన్ని గురించి ప్రశ్నించేలా ఉన్నాయి.

 పూనమ్‌పై ఇలా..:

పూనమ్‌పై ఇలా..:

మహేష్ కత్తిని కించపరిచేలా అంతకుముందు ట్వీట్ చేసిన పూనమ్ కౌర్.. ఇప్పుడిలా హుందాగా స్పందించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూనమ్ ముందే హుందాగా స్పందించి ఉంటే కత్తి కూడా ఆ సంచలన ఆరోపణలు చేసి ఉండేవాడు కాదు కదా? అన్న అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కత్తి అంతలా పవన్ ను వెంటాడుతున్నాడు కాబట్టే ఆమె కూడా వ్యక్తిగతంగా విమర్శించాల్సి వచ్చిందనేది మరికొంతమంది వాదన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X