సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు.. సుశాంత్ మృతికి కారణం అదే.. పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్
బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై యావత్ భారతావని స్పందిస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా సుశాంత్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సుశాంత్ ఉరి వేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అని సోషల్ మీడియాలో వెదుకులాట ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో పూనమ్ కౌర్ చేస్తున్న వరుస ట్వీట్లు సంచలనానికి తెరదీస్తున్నాయి. అవేంటోఓ సారి చూద్దాం.

సుశాంత్ మృతి..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలేవీ ఇంకా బయటకు రాలేదు. కానీ సుశాంత్ మరణంపై స్పందించిన పూనమ్ కౌర్ మాత్రం వెంటనే మృతికి గల కారణాలను వివరించింది.

రాజకీయాలను ఆపండి..
ఓ మనిషిని డిప్రెషన్ మానసిక ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా చేస్తుందో చూడండి.. నమ్మశక్యం గానీ ప్రతిభగల నటుడు.. మొహం మీద చిరునవ్వు ఉంటే దాని అర్థం అది కాదు.. వార్త తెలిసి షాక్‌కు గురయ్యాను.. ఓ మనిషికి ఈ ఇండస్ట్రీ ఏం చేసింది? ఎమోషనల్ అబ్యూజ్.. డిప్రెషన్స్, మెంటల్ ఇల్ నెస్ ఇచ్చిందన్నట్టుగా హ్యాస్ ట్యాగ్‌లను పెట్టింది. అంతేకాకుండా సినిమా రంగంలో రాజకీయాలను ఆపండని తెలిపింది.

సరైన కారణం తెలీదు గానీ..
‘మనకు సరైన కారణం తెలియక పోవచ్చు గానీ.. మీకు మాత్రం ఒకటి చెబుతాను.. షాక్‌లో ఉండటంతో నేనో నిర్ణయానికి వచ్చి ఉంటాను.. నవ్వుతున్నాడంటే అంతా బాగుందని కాదు.. నటులకు ఈవిధంగా జరగడం మాత్రం నన్నేమీ ఆశ్చర్యపర్చడం లేదు'అని మరో ట్వీట్ చేసింది.

డ్రిపెషన్‌కు ట్రీట్మెంట్..
మగాళ్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి.. ఏడ్వడానికి సిగ్గు పడకండని గతంలో సుశాంత్ చేసిన ఓ ట్వీట్‌ను చూపిస్తూ.. ఇదొక్కటి చాలు ఎంతో చెబుతోందని పూనమ్ తెలిపింది. ఆ ట్వీట్ తరువాత సుశాంత్ మరో ట్వీట్ చేయలేదని, డిప్రెషన్‌కు కూడా ట్రీట్మెంట్ ఉండాలని తెలిపింది.
Recommended Video

ఆ తేడా ఉండదు..
‘డిప్రెషన్ విషయానికి వచ్చేటప్పుడు లింగ వివక్షను చూపిస్తారు.. మగాళ్లంటే మానసికంగా ఎక్కువ ధృడంగా ఉంటారని, ఆడవాళ్లంటే తక్కువ అని అర్థం కాదు. చెడ్డ ఆఢవారిని మంచి మగాళ్లను అదే విధంగా చెడ్డ మగవారిని మంచి ఆడవాళ్లను కూడా చూశాను' అని డిప్రెషన్, సుశాంత్ మరణంపై ట్వీట్లు చేస్తూ వస్తోంది.


Click it and Unblock the Notifications











