అమ్మాయిలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు.. దేవుడే నిజం చెప్పాలి.. ఎడబాటుకి కారణం.. పూనమ్ కౌర్

By Rajababu

సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఫ్యాన్స్, సినీ క్రిటిక్ కత్తి మహేష్ వివాదంలో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే సృష్టించారు. పూనమ్ ఆ తర్వాత మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఆమె ఏమన్నారంటే..

డైలాగ్స్ కాపీ చేసి..

డైలాగ్స్ కాపీ చేసి..

కొందరు కాన్సెప్ట్, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకొంటున్నారు. మనషులను మారుస్తూ, మాట మీద ఉండకుండా ఉంటున్నారు. అమాయక జనాలతో ఆడుకొంటున్నారు అని తీవ్రంగా స్పందించారు.

జనాలను మభ్యపెడుతున్నారు..

జనాలను మభ్యపెడుతున్నారు..

వేష, భాషలను మారుస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భగవంతుడే నిజం చెప్పాలి

భగవంతుడే నిజం చెప్పాలి

ఇలాంటి విషయాల్లో నిజం ఏంటో భగవంతుడే తెలియజెప్పాలి. అందుకోసం భగవంతుడ్ని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని పూనమ్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు.

ఒంటరితనమే బహుమానం

ఒంటరితనమే బహుమానం

ప్రతీ పనికి ఈ కాలం ఎదో కారణం వెతుకుతుంది. మనిషి జన్మకొక కారణం మనిషి మరణానికి మరో కారణం, మనసుల కలయిక ఒక కారణం ఎడబాటుకి ఇంకో కారణం ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒంటరితనమే తనకు బహుమానం అని మరో పోస్టులో పూనమ్ పేర్కొన్నది.

నిందించుకొంటూ కాలం

నిందించుకొంటూ కాలం

నిరాశా నిస్పృహలు రాగాలు ఆలపిస్తుంటే మహిళా తన గుండెల్లో పెల్లుబికే దు:ఖాన్ని తన గొంతులోనే సవరించుకుంటన్నది. తనకు తానూ నిందించుకుంటూ ఈ లోకంలో కాలం వెళ్లదీస్తుంది. కానీ ఇప్పుడా రోజులు పోయాయి అని తన పోస్టులో పూనమ్ వెల్లడించింది.

దేవుడు మళ్లీ మళ్లీ పుట్టాలి

దేవుడు మళ్లీ మళ్లీ పుట్టాలి

అన్యాయం, అక్రమం జరిగినప్పుడు గురుగోవింద్ సింగ్ లాంటి అవతారపురుషులు దానిని చీల్చి చెండాడడానికి సత్యాన్ని కాపాడడానికి ఈ లోకంలో అవతరిస్తారు... మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉంటారు. ఒక స్ఫురణ, ఒక ఎరుక, ఒక జ్ఞాపకంలో మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని పూనమ్ కౌర్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X