త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి.. నాకు ఏం చేశాడో వాళ్లను అడగండి: హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో కొందరే సక్సెస్ అవుతుండగా.. చాలా మంది అందం, టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, ఈ మధ్య కాలంలో తనదైన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ కౌర్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీకోసమే!
సమాజం సిగ్గుపడే ఘటన
ఇటీవలే సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై ప్రణీత్ హనుమంతు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సమాజం సిగ్గుపడేలా చేసిన దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడికి వ్యతిరేకత వస్తోంది. అలాగే, హనుమంతుపై పలు కేసులు కూడా నమోదు అవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

త్రివిక్రమ్‌పైన కామెంట్స్
ప్రణీత్ హనుమంతు ఇష్యూను ముందుగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా రైజ్ చేసిన విషయం తెలిసిందే. అతడు చేసిన ఈ ట్వీట్‌కు వ్యతిరేకంగా చాలా మంది కామెంట్లు పెట్టారు. అలాగే ఓ నెటిజన్ ఓ సినిమాలో పవన్ కల్యాణ్ మాట్లాడిన డైలాగుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీనిపై పూనమ్ కౌర్ స్పందిస్తూ త్రివిక్రమ్‌పై కామెంట్స్ చేసింది.
నెటిజన్లు అసహనంగానే
నెటిజన్ షేర్ చేసిన సదరు వీడియోపై పూనమ్ కౌర్ 'ఆ డైలాగులు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన నుంచి మనం ఇంకేమి ఆశిస్తాము' అని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో మరో వివాదానికి కారణం అయ్యాయి. ముఖ్యంగా త్రివిక్రమ్‌పై పూనమ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎందుకు చేశారని
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను బ్లేమ్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన కామెంట్‌పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'పూనమ్ కౌర్ మీరు మీ వ్యక్తిగత కక్షను సోషల్ మీడియా వేదికగా చూపించకండి. త్రివిక్రమ్ గారి టాలెంట్ గురించి అందరికీ తెలుసు' అని రిప్లై ఇచ్చాడు. దీంతో పూనమ్ కూడా తనదైన రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చింది.
ఆయన నాశనం చేశాడు
పూనమ్ ఇచ్చిన రిప్లైకు సదరు నెటిజన్ 'మీ టైం బాగాలేకనో.. మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవలేదు. దానికి త్రివిక్రమ్ ఒక్కరే కారణం అయినట్లు తప్పుగా బ్లేమ్ చేయకండి' అని కౌంటర్ ఇచ్చాడు. దీనికామె 'త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు. ఆయనను సపోర్ట్ చేసే మగాళ్ల గురించి కూడా నాకు తెలుసు. మీరు మీ తరపున చెప్తున్నాను. నేను అనుభవించింది చెప్తున్నాను. ఆయన నా జీవితాన్ని నాశనం చేశాడు' అని సంచలన వ్యాఖ్యలు చేసింది.
వాళ్లను అడగండి అంటూ
ఆ తర్వాత కూడా పూనమ్ కౌర్ కొన్ని రిప్లైలు ఇచ్చింది. వాటిలో 'నేను ఆయన గురించి ఏమన్నా మీరు ఆయనకే మద్దతు ఇస్తారని నాకు తెలుసు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న మగ మహానుభావులారా.. అతడు నా పట్ల ఏం చేశాడో.. వేరే వాళ్లతో ఏం చేయించాడో వాళ్లనే అడిగి తెలుసుకోండి' అని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఇది పెద్ద వివాదంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











