ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా.. పూనమ్ కౌర్ మరో సంచలనం

పూనమ్ కౌర్.. సినిమా పరమైన పాపులారిటీ ఏమో గానీ.. సోషల్ మీడియా పాపులారిటీ మాత్రం ఫుల్లుగా ఉంది ఈ ముద్దుగుమ్మకు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా హవా నడిపిస్తూనే ఉంటుంది పూనమ్. సామాజిక మాధ్యమాల ద్వారా టచ్‌లో ఉంటూ నిరంతరం పలు వివాదాల్లో వేలు పెట్టడం, తనదైన శైలిలో రియాక్ట్ కావడం అమ్మడి స్టైల్. ఈ నేపథ్యంలోనే సామాజిక అంశాలపై కూడా కన్నెస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది పూనమ్.

 ఉదయమే గుడ్ న్యూస్.. పూనమ్ రియాక్షన్

ఉదయమే గుడ్ న్యూస్.. పూనమ్ రియాక్షన్

ఈ క్రమంలోనే ఇటీవలే జరిగిన దిశ ఎన్‌కౌంటర్‌పై స్పందించి చర్చల్లో నిలిచింది పూనమ్ కౌర్. ''ఉదయమే గుడ్ న్యూస్ విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు కొంత మంది మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నా'' అని ట్వీట్ చేసి పలు చర్చలకు తెరలేపింది పూనమ్.

పూనమ్ మరో ట్వీట్.. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా

పూనమ్ మరో ట్వీట్.. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా

ఇక అదే బాటలో తాజాగా మరో ట్వీట్ చేసిన సంచలనం సృష్టించింది. ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవిని కలిసిన పూనమ్.. ఆమెతో కలిసి దిగిన పిక్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ''ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతుంది. ఆమెను అత్యంత క్రూరంగా చంపిన ఆ నాలుగు మానవ మృగాలకు ప్రభుత్వం చట్టప్రకారం ఉరి తీయబోతోంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా'' అని పేర్కొంది పూనమ్.

దేశమంతా హాట్ టాపిక్‌.. ఆ నలుగురికీ

2012 లో జరిగిన నిర్భయ కేసు ఇప్పటిదాకా నడిచింది. చివరకు నిర్భయ కేసులో నిందితులైన ఆ నలుగురికీ డిసెంబర్ 16న ఉరి వేయబోతున్నారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన కొద్దీ రోజుల్లోనే నిర్భయ నిందితులకు కూడా ఉరి వేస్తుండటం దేశమంతా హాట్ టాపిక్‌ అయింది.

ఘటన జరిగాక ఇంతకాలమా? దురదృష్టకరం

ఘటన జరిగాక ఇంతకాలమా? దురదృష్టకరం

నిర్భయ నిందితులను ఇలా చట్టప్రకారం ఉరి వేసి చంపేయడం స్వాగతిస్తున్నారు జనం. ఇలాంటి కేసుల్లో ఇదే సరైన శిక్ష అని, కాకపోతే ఘటన జరిగాక ఇంతకాలం ఆ నిందితులను ఉరి తీయకపోవడం దురదృష్టకరమని అంటున్నారు. ఈ మేరకు పూనమ్ ట్వీట్‌పై కామెంట్ల రూపంలో తమ అభిప్రాయలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో పూనమ్ ట్వీట్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X