షాకింగ్: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. సంచలన వ్యాఖ్యలతో ట్వీట్.!
సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన 'మాయాజాలం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది గ్లామరస్ హీరోయిన్ పూనమ్ కౌర్. ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు దక్షిణాదిలోని పలు ఇండస్ట్రీల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఎక్కడా ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. ముఖ్యంగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పూనమ్.. పెద్ద పెద్ద అవకాశాలను దక్కించుకోలేకపోయింది. కానీ, నటన పరంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటించకున్నా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం ఆమె వ్యవహరిస్తున్న తీరే. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

సినిమాలు లేవు.. కానీ అక్కడ ఫుల్ బిజీ
పూనమ్ కౌర్ కొద్ది రోజులుగా సినిమాల్లో నటించడం లేదు. దీనికి సరైన కారణాలు ఎవరికీ తెలియదు కానీ, ఆమె మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. నిరంతరం తనకు సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడంతో పాటు సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. దీంతో ఆమె ఫాలోవర్స్ భారీ పెరుగుతున్నారు.

నిర్మాత ఆఫీసుకు రమ్మన్నాడు
గతంలో పూనమ్ కౌర్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. ‘టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాత మా ఇంటికి వచ్చాడు. తన సినిమాల్లో ఓ ప్రముఖ నటుడి పక్కన అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాత తన ఆఫీస్‌కి వచ్చి కలవమని చెప్పి వెళ్లిపోయారు. నేను మా అమ్మను తీసుకుని వెళ్తే.. కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడాడు' అని చెప్పి బాంబు పేల్చింది.

పీకే లవ్ అంటూ షాకిచ్చింది
2018 సెప్టెంబర్ 2న కృష్ణాష్టమి పండుగ వచ్చింది. అదే రోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కూడా. ఆ సమయంలో పూనమ్ ‘నా కృష్ణుడి పుట్టిన రోజు సందర్భంగా చాలా ప్రేమతో, మనసుపెట్టి ఓ వీడియో రూపొందించా.. నా హృదయాంతరాల్లోంచి ఆవిష్కరించిన వీడియో ఇది. త్వరలోనే విడుదల చేస్తా' అంటూ ట్వీట్ చేసింది. దీనికి ‘పీకే లవ్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేసింది.

అబద్దాల కోరు నాయకుడు కాలేడు
గతంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనం అయింది. ‘ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు మాత్రం కాలేడు' అని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయిపోయింది. పూనమ్ టార్గెట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో పీకే ఫ్యాన్స్ కూడా ఆమెను ఆడుకున్నారు.

ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు
తాజాగా దేశంలో సంచలనం అయిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ గురించి పూనమ్ స్పందించింది. ‘ఉదయమే గుడ్ న్యూస్ విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు కొంత మంది మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు' అని ట్వీట్ చేసింది.
Recommended Video

పవన్ కల్యాణ్ అన్నందుకేనా.!
పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించేనని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుంది అని పవన్ చేసిన కామెంట్లను ఆమె ట్వీట్‌లో వాడడమే. ఆమె చేసిన ఈ వైరల్ అయిపోయింది. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈ ట్వీట్ డిలీట్ చేసేసింది పూనమ్. కానీ, అప్పటికే ఇంటర్నెట్‌లో స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











