ఆయనకు మూడు పెళ్లిళ్లు.. మీకు ప్రాబ్లం కాదా? పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మైమరపించే నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఆరంభంలో వరుసగా మూవీలు చేసింది.
కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎన్నో అంశాలపై స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు చేసిన ట్వీట్‌పై పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాలను మీరే చూసేయండి!

పవన్ స్టార్ ప్రస్తావనతో
హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోంది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తావన తెస్తూ తరచూ పోస్టులు పెడుతోంది. ఇలా ఈ అమ్మడు చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోంది. దీంతో ఆమెకు శత్రువులు, మద్దతుదారులు పెరుగుతున్నారు.

ఎలన్ మస్క్‌కు ట్వీట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు / కార్యకర్త X (ట్విట్టర్) ఖాతాలో 'డియర్ ఎలన్ మస్క్.. నేను ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని. మా రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. నేను యూకేలో టెస్లా కారును నడుపుతున్నాను. అలాగే, X ఖాతాను ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. ఈ రెండు నా దినచర్యలో భాగం అయ్యాయి' అని ట్వీట్ చేశాడు.
ఏపీలో పెట్టుబడి కోసం
అదే ట్వీట్‌లో సదరు వైసీపీ నాయకుడు 'ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేమంతా మీ టెస్లా కార్లను మరింతగా తయారు చేయడం కోసం సహాయం చేస్తాము. మా రాష్ట్రంలో యూనిట్ (కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ) పెట్టాలని మీకు స్వాగతం పలుకుతున్నాము' అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు, కొన్ని న్యూస్ పేపర్లలో వచ్చిన కటింగ్స్‌ను కూడా ఈ పోస్టుకు జత చేశారు.

మూడు పెళ్లిళ్లు అంటూ
సదరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం మంది ఆయనను విమర్శిస్తూ రిప్లైలు ఇస్తుండగా.. వైసీపీ వాళ్లు సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ దీనిపై స్పందించింది. ఈ మేరకు అతడికి కౌంటర్ ఇస్తూ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకు వచ్చింది.
మీకు ప్రాబ్లం కాదా అని
ఆ వైసీపీ నాయకుడు చేసిన ట్వీట్‌కు హీరోయిన్ పూనమ్ కౌర్ 'ఆయన (ఎలన్ మస్క్) మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది మీకు ప్రాబ్లం కాదా' అని సూటిగా ప్రశ్నిస్తూ కౌంటర్ వేసింది. ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్లతో పాటు సదరు నాయకుడు పవన్ కల్యాణ్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శించారు. ఇప్పుడు దానికి కౌంటర్‌గానే పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

పవన్ ఫ్యాన్స్ మద్దతు
పూనమ్ కౌర్ తాజాగా వైసీపీ నాయకుడికి ఇచ్చిన కౌంటర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ పోస్టు కింద తమ మద్దతును తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి గతంలో పూనమ్ కౌర్ పవన్‌ను పరోక్షంగా విమర్శించింది. కానీ, ఇప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











