త్రివిక్రమ్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: తప్పుడు పనులు చేస్తూ.. సీఎం ఆఫీసులో కూడా అంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు చాలా తక్కువగానే ఎంట్రీ ఇస్తున్నారు. అలా చాలా రోజుల క్రితమే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన భామ పూనమ్ కౌర్. అందంతో పాటు అభినయంతో మెప్పించినా చాలా కాలంగా పెద్దగా అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది.

అయితేనేం.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్టుల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ కౌర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో మీరే చూడండి!

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas About Guntur karam

గుంటూరు కారంతో గురూజీ: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' అనే సినిమాను తీస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas About Guntur karam

ఆ నవలను కాపీ కొట్టాడని: సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్ బాబుతో 'గుంటూరు కారం' మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇది త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని 'కీర్తి కిరీటాలు' అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో లీకైంది. దీంతో ఇప్పుడు అందరూ ఆ రచన గురించి చర్చలు జరుపుకుంటున్నారు.

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas About Guntur karam

స్పందించిన పూనమ్ కౌర్: 'గుంటూరు కారం' మూవీని 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగా తెరకెక్కించారన్న వార్తను తాజాగా ఓ ఫేమస్ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీన్ని సదరు సంస్థ X (ట్విట్టర్‌)లో పోస్ట్ చేయగా.. దాన్ని తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ రీట్వీట్ చేసింది. అంతేకాదు, గతంలో మాదిరిగానే దీనిపై తనదైన రీతిలో స్పందించడంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆమె సంచనల వ్యాఖ్యలు చేసింది.

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas About Guntur karam

ఏదైనా చేయగలడు అని: 'గుంటూరు కారం' మూవీపై వచ్చిన గాసిప్ స్టోరీని రీట్వీట్ చేసిన పూనమ్ కౌర్ 'ఆయన (త్రివిక్రమ్ శ్రీనివాస్) ఏదైనా చేయగల సమర్ధుడు. అలాగే, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలిసినవాడు. అతడి తప్పుడు పనులు జనాలకు కనిపించకుండా చేయగల నైపుణ్యం ఉన్న వాడు కూడా' అంటూ గత విషయాలు గుర్తుకు వచ్చేలా X (ట్విట్టర్‌)లో రాసుకొచ్చింది.

Poonam Kaur Sensational Tweet On Trivikram Srinivas About Guntur karam

ప్రజలు పట్టించుకోరంటూ: అదే ట్వీట్‌లో హీరోయిన్ పూనమ్ కౌర్ రాజకీయాలను కూడా ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించింది. 'సాధారణంగా ప్రజలు తమ సమస్యల గురించి కాకుండా.. ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇంత ప్రత్యేకమైన సీఎం ఆఫీస్ ఎందుకు ఉందని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇలాంటి పనులు ఎలా కనిపిస్తాయి' అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.

సీఎం ఆఫీస్‌లోకి కూడా: ఆ తర్వాత మరో ట్వీట్‌లో హీరోయిన్ పూనమ్ కౌర్.. 'ఆయనకు సీఎం కార్యాలయంలోకి కూడా అనుమతి ఉంది' అని ఆరోపించారు. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతోన్నాయి. అదే సమయంలో పూనమ్ - గురూజీ మధ్య అసలేం జరిగిందో తెలియక జనాలు అందరూ జుట్టు పీక్కుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X