వైఎస్ జగన్ ఫ్యామిలీపై తెలుగు హీరోయిన్ ట్వీట్.. ఆ ముగ్గురు ఆడవాళ్ల వల్లే అంటూ షాకింగ్‌గా!

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు టాలీవుడ్‌లోకి హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన సినిమాలతో సందడి చేయగా.. మరికొందరు కొన్ని మూవీలతోనే కెరీర్‌లను ముగించారు. అలాంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. ఈ మధ్య కాలంలో పెద్దగా బిగ్ స్క్రీన్‌పై కనిపించని ఈ చిన్నది.. సోషల్ మీడియాలో కాంట్రవర్శీ పోస్టులతో హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ పూనమ్ కౌర్ ఏం చెప్పుకొచ్చిందో మీరే చూసేయండి!

పవన్, పొలిటికల్ ట్వీట్లతో
తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోంది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు పాలిటిక్స్ ప్రస్తావన తెస్తూ తరచూ పోస్టులు పెడుతోంది. ఇలా ఈ అమ్మడు చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతూ ముందుకు సాగిపోతోంది.

Poonam Kaur Sensational Tweet On YS Jagan Mohan Reddy Family Controversy

ఏపీ ఎలెక్షన్‌పై పూనమ్
సోషల్ మీడియాలో తనదైన ట్వీట్లతో దూసుకుపోతోన్న పూనమ్ కౌర్.. అప్పుడప్పుడూ చేసిన ట్వీట్లు హైలైట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆ మధ్య ఈ చిన్నది 'వై నాట్ 175' అంటూ ఓ పోస్ట్ చేసింది. ఈ స్లోగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కావడంతో.. ఆమె ఆ పార్టీకి సపోర్టుగా పెట్టిందా? లేక వెటకారంగా పెట్టిందా? అన్నది బాగా చర్చనీయాంశం అయిపోయింది.

వైఎస్ జగన్ ఫ్యామిలీపై
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇందులో గత అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ తాజాగా వైఎస్సార్ ఫ్యామిలీపై ఓ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Poonam Kaur Sensational Tweet On YS Jagan Mohan Reddy Family Controversy

ఆ ముగ్గురు ఆడవాళ్లే
తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పూనమ్ కౌర్ 'గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని అందుకోడానికి ఆయన జీవితంతో సంబంధం ఉన్న ముగ్గురు ఆడవాళ్లే. ముఖ్యంగా భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలను నేర్పారు' అంటూ వైఎస్ ఫ్యామిలీ ప్రస్తావన తెస్తూ ట్వీట్ పెట్టింది.

వాళ్లంతా కలవాంటూ
ఇదే ట్వీట్‌లో తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ 'ఒకప్పుడు ఎలా అయితే కలిసి ఉన్నారో వైఎస్ ఫ్యామిలీలోని వీళ్లంతా అలాగే కలిసి ఉండాలి. ప్రేమ, శాంతిని కలిగి ఉండాలి' అంటూ కోరుకుంది. తద్వారా వైఎస్ ఫ్యామిలీలో విభేదాలను పరోక్షంగా ప్రస్తావించింది. ఇక, పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్‌పై ఓ వర్గం కోపంగా, మరో వర్గం సంతోషంగా ఉందని చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X