పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. ఆ డైరెక్టర్ సినిమాలే కాదు, మనుషులని కూడా, మళ్ళీ సస్పెన్సే!

Recommended Video

Poonam Kaur Sensational Comments In Twitters

హీరోయిన్ పూనమ్ కౌర్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మెరుపులా సంచలన ట్వీట్స్ చేస్తూ, అందరిని సస్పెన్స్ లోకి నెడుతూ మాయమవుతోంది. పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతోందో అర్థం కాక సినీవర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ఆ మధ్య ఓ ఫిల్మ్ క్రిటిక్, పూనమ్ కౌర్ మధ్య ట్విట్టర్ వార్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతడు పూనమ్ కౌర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాజగా పూనమ్ కౌర్ ఓ దర్శకుడిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. పూనమ్ కౌర్ ఇలాంటి ట్వీట్స్ చేయడం కొత్తేమి కాదు. నర్మ గర్భ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో ఎవరినో టార్గెట్ చేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ డైరెక్టర్ మనుషులని కూడా

ఆ డైరెక్టర్ మనుషులని కూడా

ఆ డైరెక్టర్ సినిమాలే కాదు మనుషులని కూడా బాగా డైరెక్ట్ చేయగలడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని ప్రయత్నించాడు. ఎందుకు ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే ఏమి ఎరుగనట్లు ప్రవర్తించాడు. అతడికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఇండీస్ట్రీలో ఉండాలని భావిస్తాడు. ఆ దర్శకుడు ఎవరనే విషయం మాత్రం పూనమ్ కౌర్ వెల్లడించలేదు.

కారణాలు చెప్పలేను

కారణాలు చెప్పలేను

ఎవరికైనా అవకాశం ఇస్తున్నారంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు కనీసం చెప్పలేను కుడా అంటూ పూనం కౌర్ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో పూనమ్ కౌర్ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ఆమె ప్లాపుల్లో ఉన్నా కుడా

ఆమె ప్లాపుల్లో ఉన్నా కుడా

దర్శకుడికి చెందిన ఓ అమ్మాయి వరుసగా ప్లాపుల్లో ఉంది . అయినా కుడా ఆమెకే అవకాశాలు ఇచ్చారు. దానికి గల కారణాలు తెలియవు. అసలు ఇంతకి ఇండస్ట్రీ లో ఏం జరుగుతోంది అంటూ పూనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఆశలు పెంచడం తప్పు

ఆశలు పెంచడం తప్పు

నమ్మించేలా మాటలు చెప్పి, ఆశలు పెంచి ఆ తరువాత ఏమి జరగనట్లు వెళ్లిపోవడం చాలా తప్పు అని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది. కేవలం తెలివైన వారు మాత్రమే ఆధారాలు ఉంచుకుంటారు.. అమాయకులు గుడ్డిగా నమ్ముతారు అంటూ పూనమ్ నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఇంతకీ ఎవరిని ఉద్దేశించి

ఇంతకీ ఎవరిని ఉద్దేశించి

ఇంతకీ పూనమ్ కౌర్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అని ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే శ్రీరెడ్డి, కాస్టింగ్ కౌచ్ లాంటి వ్యవహారాలు ఇండస్ట్రీని కుదిపేస్తున్న తరుణంలో పూనమ్ కౌర్ ట్వీట్స్ సెగలు పుట్టించేవిగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X