twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కా, బావ సినిమా హిట్టంటూ స్క్రీన్ షాట్ వదిలిన పూనమ్.. నాలుగేళ్ల తరువాత పాజిటివ్ న్యూస్ అంటూ!

    |

    టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నా తర్వాత నటిగా రాణించలేకపోయింది పూనమ్ కౌర్. అయితే ఆమె చేసిన సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉంటుంది ఆమె. మె ఏదీ కూడా సరిగా చెప్పదు కానీ వేయాల్సిన పంచ్‌లు వేసేస్తుంది. అది ఎవరి గురించి వేస్తుందో అనేది కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అయితే అలాంటి వాటిలో కొన్నిటిని పూనమ్ కౌరే డిలీట్ చేయడం, లేదా సైలెంట్ అవడమో చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె బావ అంటూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    వర్మని టార్గెట్ చేసి

    వర్మని టార్గెట్ చేసి

    గత కొద్ది రోజులుగా హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల గురించే కాక సామాజిక పరిస్థితుల మీద స్పందిస్తూ వస్తోంది. తాజాగా డైరెక్టర్ వర్మని టార్గెట్ చేసి ట్వీట్ చేసింది. అతడు చేసిన ట్వీట్‏కు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది పూనమ్ కౌర్.

    సోషల్ మీడియాలో హాట్ టాపిక్

    సోషల్ మీడియాలో హాట్ టాపిక్

    భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ సూపర్ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్‏కు పూనమ్ కౌర్ రిప్లై ఇచ్చింది. ఒక దర్శకుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కామెంట్ చేస్తారు. మూలగా.. సైలెంట్‏గా ఉండిపోతారు.. మరో దర్శకుడు ఆయన్ని రాజకీయంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ట్విట్టర్‏లో నవ్వుతుంటాడు.

    ఇద్దరూ డబ్బులిచ్చి బాడుగకు తెచ్చుకోబడిన ఏజెంట్లే అని కామెంట్ చేసింది. వారు మహిళలను ఆయుధాలుగా వాడుకుంటారు అంటూ ట్వీట్ చేసింది. పూనమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా ఆ విషయం మరువక ముందే ఆమె మరో కామెంట్ చేసింది.

    నిజాయితీగా రివ్యూ

    ఇక తాజాగా పూనమ్ కౌర్ ఓ వాట్సప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం మ్యాడీ అనే వ్యక్తి వాట్సాప్ స్టేటస్లో భీమ్లా నాయక్ సినిమా చూస్తున్నానని పెట్టుకున్నాడు. దానికి వాట్ అని రిప్లై ఇవ్వగా దానికి అతని సినిమాకి వచ్చిన అక్కా.. బావ సినిమా.. ఉదయం 8 గంటలకు.. స్టార్ ఎమోజీలను రిప్లై ఇచ్చారు. ఇక వాటికి సిగ్గు పడుతున్నట్టుగా ఎమోజీలతో పాటు..నిజాయితీగా రివ్యూ చెప్పమని మరొకరు అడిగినట్టు కనిపిస్తోంది.

    అక్క, తమ్ముడు ఎవరు

    అక్క, తమ్ముడు ఎవరు

    అప్పుడు సరే అక్కా అని అవతలి వ్యక్తి రిప్లై ఇవ్వడమే కాక సినిమా చూస్ వచ్చిన తరువాత అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అని అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు. ఈ స్క్రీన్ షాట్‌ను పూనమ్ కౌర్ షేర్ చేయడంతో అసలు ఇందులో అక్క ఎవరు.. తమ్ముడు ఎవరు.. బావ ఎవరు అనే చర్చ మొదలయింది. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవడంతో ఇందులో అక్క, తమ్ముడు ఎవరు అనే చర్చ నడుస్తోంది.

    పాజిటివ్ న్యూస్ కాబట్టి

    పాజిటివ్ న్యూస్ కాబట్టి

    అయితే గతంలో పవన్ కళ్యాణ్ కి పూనమ్ కౌర్ కి లింకు పెడుతూ కత్తిమహేష్ లాంటి వారు సంచలన ఆరోపణలు చేశారు. ఆ విషయం మీద ఎప్పుడూ నేరుగా స్పందించింది లేదు కానీ ఇప్పుడు ఏకంగా స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో కొత్త చర్చ మొదలయింది. ఆ తరువాత నాలుగేళ్లలో ఇది పాజిటివ్ న్యూస్ కాబట్టి షేర్ చేశానని పేర్కొంది.

    English summary
    Poonam Kaur Shares WhatsApp Screen Shot resembling Bheemla Nayak's hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X