చచ్చిపోతే ఒక్కరోజే వార్తల్లో ఉంటావ్ అన్నాడు.. డైరెక్టర్ గురూజీ గుట్టు విప్పిన పూనమ్ కౌర్
సినీ నటి పూనమ్ కౌర్ మరోసారి స్టార్ డైరెక్టర్ పై ఊహించని విధంగా కామెంట్ చేసింది. గురూజీ అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వడంతో ఆ దర్శకుడు అతనే అంటూ నెటీజన్స్ కూడా స్పందిస్తున్నారు. అయితే ఆ డైరెక్టర్ తనతో జాలి లేకుండా మాట్లాడాడు అంటూ పూనమ్ తీవ్ర స్థాయిలో ట్వీట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

హెల్ప్ చేయమని అడిగితే..
పూనమ్ వివరణ ఇస్తూ.. రిలేషన్ మెయింటైన్ చేసిన ఒక దర్శకుడి దగ్గరకు వెళ్లిన నా స్నేహితుడు. రెండు మూడు సార్లు నా పరిస్థితి గురించి వివరించాడు. ఆమె డిప్రెషన్ లో ఉందని ఈ సమయంలో ఆమెకు హెల్ప్ చేయాలని కోరాడు. కానీ దర్శకుడు మాత్రం పట్టించుకోకుండా అలానే లేట్ చేస్తూ వచ్చాడు. ఆ తరువాత నేనే వెళ్లి అతన్ని డైరెక్ట్ గా ప్రశ్నించాను.

చచ్చిపోతే ఒక్కరోజే..
నేను నీతో మాట్లాడాలి అంటూ నా పరిస్థితిని ఈ డిప్రెషన్ ని మార్చగలవా అని అడిగాను. అంతే కాకుండా నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అన్నాను. వెంటనే ఆ దర్శకుడు ఒక సమాధానం ఇచ్చాడు. నువ్వు చచ్చిపోతే ఏమి జరగదు. ఒక్కరోజు మాత్రమే న్యూస్ లో ఉంటావు అని అనగానే నాకు నా అసహ్యం వేసింది. మీడియాను, మూవీ మాఫియాను, అడ్వర్టైజ్‌మెంట్స్‌ను అతనే కంట్రోల్ చేస్తాడు.

తప్పుడు ప్రచారాలు..
ఇక వెబ్ సైట్స్ లో నా మీద తప్పుడు ఆర్టికల్స్ రాయిస్తూ నన్ను మరింతగా డిప్రెషన్ లోకి నెట్టేశాడు. అతను నాతో చేసిన ప్రయాణంలో మధ్య రాత్రి అయినా వస్తాను అనే వాడు. కానీ ఇప్పుడు చచ్చిపోతే ఒకరోజు న్యూస్ లో ఉంటావు అనే వరకు వచ్చాడు. అయినా నేను ఎందుకు బాధపడలి అంటూ పూనమ్ ఆ దర్శకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.
Recommended Video

ఆ గురూజీ ఎవరు..
ఇక చివరగా.. అతను తన ఉన్నతమైన పరిచయాలతో తప్పుడుగా నడుచుకుంటున్నట్లు చెబుతూ.. అతన్ని నాకున్న సమస్యను పరిష్కరించమని సహాయం అడగలేదు.. కానీ తనకున్న టెక్నీక్స్ పరిచయాలతో తనకు నచ్చిన వారికే అవకాశాలు ఇస్తూ.. భజన చేస్తూ ఉంటాడు. నన్ను సైలెంట్ గా బ్యాన్ చేయడం తప్ప నువ్వు ఏం చేయగలవు అంటూ పూనమ్ గురూజీ అనే హ్యాష్ ట్యాగ్ తో క్లియర్ గా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











