మిస్టర్ డైరెక్టర్.. నా దగ్గర కాదు, ఎన్నారై హీరోయిన్ల వద్ద చేసుకో.. రేణుదేశాయ్ బాటలో పూనమ్ కౌర్!

Recommended Video

Poonam Kaur Takes Sensational Comments On Director

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా కాలంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పరోక్షంగా ఓ దర్శకుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దర్శకుడి వలనే తన కెరీర్ నాశనం అయిందనే అర్థం వచ్చే విధంగా పూనమ్ కామెంట్స్ చేస్తోంది. ఇటీవల రేణు దేశాయ్ తీసుకున్న సంచలన నిర్ణయాన్నే పూనమ్ కౌర్ కూడా తీసుకుంది. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ చాలా ఘాటుగా ఉన్నాయి.

 రేణు దేశాయ్ బాటలోనే

రేణు దేశాయ్ బాటలోనే

ఇటీవల రేణు దేశాయ్ తన ట్విటర్ అకౌంట్ ని క్లోజ్ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నెటిజన్ల ట్రోలింగ్ నుంచి దూరంగా ఉండేందుకు రేణు దేశాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తాజాగా పూనమ్ కౌర్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.

గందరగోళం

ఇటీవల పూనమ్ కౌర్ చేస్తున్న ట్వీట్స్ పై కూడా నెటిజన్ల ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో గందరగోల పరిస్థితులు నెలకొంటున్నాయని అందువలన తాను ట్వీటర్ వదలి వెళుతున్నట్లు పూనమ్ కౌర్ ప్రకటించారు. తాను తిరిగి సోషల్ మీడియాలోకి ఎప్పుడు వస్తానో చెప్పలేనని పూనమ్ తెలిపింది.

 పరోక్షంగా

పరోక్షంగా

పూనమ్ కౌర్ ఇప్పటి వరకు పరోక్షంగా తీవ్ర చర్చకు దారితీసేలా చాలా ట్వీట్స్ చేసింది. ఆ మీ ట్వీట్స్ ని బట్టి చూస్తే ఓ దర్శకుడ్ని ఆమె టార్గెట్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దీనితో పూనమ్ పై నెటిజన్లు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు.

అజ్ఞాతవాసం ఎందుకో

అజ్ఞాతవాసం ఎందుకో

కొంతమంది ఎందుకు అజ్ఞాతవాసంలోకి వెళ్లారో అభిమానులు తెలుసుకోవాలని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలోకి నెట్టేయడం ఆ దర్శకుడికి అలవాటే అని పూనమ్ కౌర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మిస్టర్ డైరెక్టర్ అంటూ

మిస్టర్ డైరెక్టర్ అంటూ

మిస్టర్ డైరెక్టర్ అంటూ పూనమ్ కౌర్ పరోక్షంగా ఆ దర్శకుడిపై విరుచుకుపడింది. నా వద్ద అలాంటి పనులు చేయడానికి కూడా ప్రయత్నించవద్దు. కావాలంటే నీ ఎన్నారై హీరోయిన్ల వద్ద ట్రై చేసుకో అంటూ పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

నా మీదే కథలు

నా మీదే కథలు

నా మీదే కథలు అల్లుతుంటే చూస్తూ ఊరుకోను. నా ఇంటర్వ్యూ చూడక ముందే నా పై గొప్ప కథ అల్లాడని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది.

 వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు

వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు

అతడు కొంతమంది మంత్రులు, నటుల కాళ్ళు పట్టుకున్నదని కూడా పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది. కానీ పూనమ్ కౌర్ పరోక్షంగా వ్యాఖ్యానించడంతో నెటిజన్లు, అభిమానుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X