twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ప్రార్థనలే సమాధానం చెబుతాయి..పూనమ్ కౌర్ పరోక్షంగా!

    |

    Recommended Video

    Poonam Kaur Gets Casted In A Crazy Project '3 Dev'

    ప్రతిభ ఉన్న నటి అయినా పూనమ్ కౌర్ కు అదృష్టం కలిసిరాక కెరీర్ లో పెద్దగా అవకాశాలని అందిపుచ్చుకోలేదు. నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పూనమ్ కౌర్ తన ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంది. పూనమ్ కౌర్ ఇటీవల పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. పూనమ్ కౌర్ కెరీర్ ని మలుపుతిప్పే అవకాశం ఆమెకు ఇంతవరకు దక్కలేదు. అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా అవి చిన్న చిత్రాలలో మాత్రమే. తాజాగా మరో మారు పూనమ్ కౌర్ ఓ ఇంటర్వ్యూ లో పరోక్ష వ్యాఖ్యలు చేసింది.

     చిన్న చిత్రాలతో గుర్తింపు

    చిన్న చిత్రాలతో గుర్తింపు

    పూనమ్ కౌర్ చిన్న చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమై గుర్తింపు తెచ్చుకుంది. మాయాజాలం చిత్రంతో పూనమ్ కౌర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఒక విచిత్రం, వినాయకుడు, శౌర్యం, గగనం వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు పొందింది.

    అవకాశాలు తగ్గుముఖం

    అవకాశాలు తగ్గుముఖం

    క్రమంగా పూనమ్ కౌర్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కానీ నటిగా ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి పూనమ్ కౌర్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

     పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు

    పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు

    ఇటీవల తరచుగా పూనమ్ కౌర్ పరోక్షంగా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ మధ్యన హల్ చల్ చేసిన సినీ క్రిటిక్ వివాదంలో కూడా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది.

     ఎట్టకేలకు లక్కీ ఛాన్స్

    ఎట్టకేలకు లక్కీ ఛాన్స్

    చాలా కాలానికి పూనమ్ కౌర్ నిరీక్షణ ఫలించిందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో క్రేజీ చిత్రంలో నటించే అవకాశాన్ని పూనమ్ కౌర్ అందిపుచ్చుకుంది.

    బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా

    బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా

    పూనమ్ కౌర్ అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ 3 దేవ్. ఈ చిత్రంలో కరణ్ సింగ్ గోవర్, రవి దుబెయ్, కునాల్ రాయ్ బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులుగా కనిపించబోతున్నారు. కరణ్ సింగ్ గోవర్ సరసన నటించే అవకాశాన్ని పూనమ్ కౌర్ దక్కించుకుంది.

    మరో మారు పరోక్షంగా

    మరో మారు పరోక్షంగా

    3 దేవ్ చిత్రం గురించి పూనమ్ మాట్లాడుతూ మరోమారు పరోక్ష వ్యాఖ్యలు చేసింది. తాను చేస్తున్న ప్రార్థనలు అన్నింటికీ సమాధానం చెబుతాయని వ్యాఖ్యానించింది. బాలీవుడ్ లో తొలి అవకాశం రావడం తన ప్రార్థనల ఫలితమే అని పూనమ్ కౌర్ అభిప్రాయ పడింది.

    English summary
    Poonam Kour once again made indirect comments. My prayers have been answered said Poonam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X