విచారణ పేరుతో పోలీసులు టార్చర్ పెట్టారంటోంది

By Srikanya

ముంబయి: విచారణ పేరుతో తనని పోలీసులు టార్చర్ పెట్టారంటోంది పూనమ్ పాండే. తనని పోలీసులు అరెస్టు చేయలేదని, అయితే తన సోదరుడు తో కలిపి ప్రశ్నించారని, అది టార్చర్ లా సాగిందంటోంది. తర్వాత తను పూనమ్ పాండేనని, సెలబ్రెటీనని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారని అంటోంది. మొదట తాను స్టేషన్ కి వెళ్లటానికి ఒప్పుకోలేదని, అయితే వారు సీన్ క్రియేట్ చేసేలా ఉన్నారని వెళ్ళానని అంటోంది.

అలాగే నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను...సెలబ్రెటీని కావటమేనా నేను చేసిన తప్పు అని ప్రశ్నిస్తోంది. అలాగే ఇదంతా పోలీసలు క్రియేట్ చేసిన డ్రామా అని, తనను కొన్ని పేపర్లు మీద సంతకం పెట్టమన్నారంటూ వాపోతోంది. అలాగే తాను బట్టలు అసభ్యంగా వేసుకున్నారంటూ మీడియాలో అంటున్నారని, అయితే తన సోదరుడుతో కలిసి తిరుగుతూ అలాంటి దుస్తులు ఎలా వేసుకుంటాను అని అడుగుతోంది.

Poonam Pandey alleges police torture

ఇక ఎప్పుడూ ఏదో ఒక అంశంతో సంచలనం సృష్టిస్తుండే మోడల్‌ పూనమ్‌పాండే ఈ దఫా అరకొర వస్త్రధారణతో నడిరోడ్డుపై దాదాపుగా అంగాంగ ప్రదర్శన చేసినందుకు అరెస్టయ్యారు. ఆమెను పోలీసులు హెచ్చరించి అనంతరం విడుదల చేశారు. ఈ సంఘటన మీరా రోడ్‌లోని శివార్‌ గార్డెన్‌ ప్రాంతంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. అక్కడ ఆమె తన కారును పార్కు చేసి నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు మొదలు పెట్టారు. దీంతో అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను అరెస్టు చేశారు.

ఓ పెద్ద నాయకుడి నుంచి ఫోన్‌ రావడంతో ఎలాంటి విచారణ లేకుండానే పోలీసులు ఆమెను విడిచిపెట్టారని సమాచారం. ఆమె దుస్తుల తీరు చూసిన తర్వాత భద్రతా కారణాలను పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేసి...అనంతరం విడుదల చేసి...ఆ తర్వాత తామే స్వయంగా పూనమ్‌ను ఆమె ఇంటికి తీసుకెళ్లి తల్లికి చెప్పి మరీ అప్పగించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తాను కారు ఓ పక్కగా నిలిపి పాటలు వింటూ ఆనందిస్తుంటే తనను అన్యాయంగా అరెస్టు చేశారన్నది పూనమ్‌ వాదనగా ఉంది.

కారు ఆపి కూచుని పాటలు వినడం అనేది అశ్లీలం కాదనీ...తనపై అనవసర వదంతులు పుట్టించవద్దంటూ ట్విట్టర్‌లో రాశారు. భారత్‌ ప్రపంచ కప్‌ గెలిస్తే ఒంటిపై దుస్తుల్లేకుండా కనిపిస్తానన్న ఆమె ప్రకటన ఒకప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది. అనంతరం ఆమె ఏదో ఒక కారణంపై ఇలాంటి ప్రకటనలు చేస్తూ సంచలనానికి కేంద్రబిందువు అవుతూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X