నా సినిమాని చంపేస్తున్నారంటూ హీరోయిన్ గోల
ముంబై : 'నేను నటించిన తొలి చిత్రం 'నషా'. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం దర్శకుడు అమిత్ సక్సెనా ఈ సినిమాను చేశాడు. అయితే ఆ థియేటరల్లో నుంచి 'నషా'ను అర్థాంతరంగా తీసేశారు' అంటోంది పూనమ్ పాండే. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం 'నషా'. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ ''నషా' పై భారీ అంచనాలు పెట్టుకున్నాను. ఈ సినిమా కోసం నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది.
పెద్ద నిర్మాణ సంస్థల సినిమాల కారణంగా నా చిత్రాన్ని చంపేస్తున్నారు. విడుదలైన అన్ని సెంటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయినా బలవంతంగా మల్టీప్లెక్స్ థియేటర్ల నుంచి మా సినిమాను తప్పించడం బాధను కలిగిస్తోంది అని తెలిపింది. విపరీతమైన ప్రచారహోరుతో బాలీవుడ్ చిత్రం 'నషా' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీలో ఉన్నంత తెరపైనా కనిపించేసరికి అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది కుర్రకారు మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళుతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో పూనమ్ ఇరగదీసిందని అంతా చెబుతున్నారు.
పూనమ్ అంగాంగ ప్రదర్శనతో నషాలానికి నిషా ఎక్కించిందని చెబుతున్నారు. అయితే ఇదే సినిమాపై కొందరు విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. సినిమాకి తక్కువ డాక్యుమెంటరీకి ఎక్కువ అన్నట్టు కథనం ఆసక్తికరంగా లేదని అంటున్నారు. సినిమా చూస్తున్నంతసేపూ అంతర్జాలంలో పూనమ్ ఫోటోలన్నిటినీ స్లైడ్‌షోలో చూసినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ఈ హాటీ బట్టలు విప్పేసినంత తేలిగ్గా హావభావాలు ప్రదర్శించలేకపోయిందని విమర్శకులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే రిలీజ్ తొలి మూడురోజులు బాక్సాఫీస్‌కి ఏ ఢోకా లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
న్యూడ్ ఫోజులు, సెక్సీ భంగిమలు, శృంగార పరంగా ఉద్రేక పరిచే స్టేట్‌మెంట్లతో సెన్సేషన్ సృష్టిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న వివాదాస్పద మోడల్ పూనమ్ పాండే త్వరలో శృంగార ప్రియుల నషాలానికెక్కే మసాలాతో వెండితెరపై అరంగ్రేటం చేస్తానంటూ ఊరించింది. ఇంత కాలం ట్విట్టర్‌లో సెమీ న్యూడ్ ఫొటోల దగ్గరనుంచి, దాదాపు న్యూడిటీ ప్రదర్శించే ఫొటోలదాకా.. పూనమ్ పాండే చేసే హంగామా అంతా ఇంతా కాదు. 'నషా' సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తున్న పూనమ్ పాండే తన అభిమానులకు అందాల విందు చేసింది.


Click it and Unblock the Notifications












