ఇచ్చినమాట కోసం...అన్నీ విప్పేసి నగ్నంగా!
మోడల్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లదనుకుంటా. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే... నగ్నంగా అందాల విందు చేస్తా అంటూ అప్పట్లో ప్రకటించిన పూనమ్...ఆ తర్వాత ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అమ్మడు ఇచ్చిన మాటను ఐపీఎల్-5 సందర్భంగా నిలబెట్టుకుంది. ఐపీఎల్-5 టైటిల్ గెలచుకున్న కోల్‌కతా టీంను అభినందిస్తూ......బట్టలన్నీ విప్పేసి నగ్నంగా దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసింది.
ఈ సందర్భంగా పూనమ్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...''గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా'' అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాదండోయ్....18 సంవత్సరాల లోపు వారు తన నగ్న ఫోటోను చూడొద్దని, చూస్తే నా బాధ్యత కాదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
పూనమ్ బూతు ఫోజుల సంగతి పక్కన పెడితే... ఆమె జీవితంపై త్వరలో ఓ సినిమా రూపొందబోతోంది. తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, మోడల్ గా ఎదిగిన తీరు, అనతి కాలంలోనే పాపులర్ అయిన వైనాన్ని ఈచిత్రంలో చూపెట్టబోతున్నారని తెలుస్తోంది.
బూతు మార్గంలో పయనించిన పూనమ్ లాంటి వారికి పబ్లిసిటీ పెరగడానికి కారణం...మన దేశ జనాల్లో రోజు రోజుకు బూతుపై మోజు పెరిగి పోవడమే. పరిస్థితి ఇలా ఉండబట్టే... బూతును క్యాష్ చేసుకోవడానికి సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి అలాంటి భామలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వెరసీ మన సినిమాల్లో బూతు రాజ్యమేలుతోంది.


Click it and Unblock the Notifications











