ఆ ప్లేసులో సచిన్ టాటూ వేసుకున్న హాట్ హీరోయిన్
హైదరాబాద్: బాలీవుడ్ నటి, సంచలన మోడల్ పూనమ్ పాండే దేశంలోని క్రికెట్ ఫీవర్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని పబ్లిసిటీ పెంచుకోవడంలో ఆరితేరిపోయింది. ఆ మధ్య టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల విందు చేస్తానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పూనమ్ పాండే సచిన్ రిటైర్మెంట్ ఇష్యూను తన పబ్లిసిటీకి వాడుకుంటోంది.
ఇపుడు దేశం మొత్తం సచిన్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో తన అందమైన శరీరంపై సచిన్ టాటూను వేయించుకుంది. తన కుడిచేతి భుజంపై సచిన్ టాటూటో దర్శనమిచ్చింది. సచిన్ వీరాభిమానిని అని చెప్పుకుంటున్న పూనమ్ పాండే ఇటీవల ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ ఆడిన చివరి మ్యాచ్‌కు కూడా హాజరైంది.
అందాల ఆరబోతతో పబ్లిసిటీ పెంచుకోవడం ఎలానో పూనమ్ పాండేకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై అందాలు ఆరబోయడం మొదలైన పూనమ్ పాండే జోరు...ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా చేసుకుని తన అందాల ఆరబోతతో సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు సాగింది. దేశంలోని ప్రముఖులపై కామెంట్లు చేస్తూ మీడియా దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.
ఇలా పబ్లిసిటీ పెంచుకున్న పూనమ్ పాండే....'నషా' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నటనారంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా పేలక పోయినా....అమ్మడు అందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఐటం సాంగుల అవకాశాలు ఆమెను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సౌత్ చిత్రాల్లో పూనమ్ పాండే ఐటం సాంగులు చేస్తూ అందాల విందు చేసింది.


Click it and Unblock the Notifications












