న్యూఇయర్ పార్టీలో సెక్సీగా పెర్ఫార్మెన్స్ ఇస్తా: పూనమ్ పాండే
హైదరాబాద్: న్యూఇయర్ పార్టీలో తన సెక్సీ సొగసులతో ఇరగ దీస్తానని అంటోంది బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే. జూబ్లీహిల్స్ లోని దుర్గం చెరువు వద్ద జరిగే న్యూఇయర్ నైట్ పార్టీలో ఆమె పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. ఇందులో భాగంగా తన తాజా తెలుగు సినిమా ‘మాలిని అండ్ కో' చిత్రం ప్రమోషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ స్లైడ్ షోలో....
‘మాలిని అండ్ కో' చిత్రానికి వీరు.కె దర్శకుడు. మనీషా ఫిలింస్ పతాకంపై కిషోర్‌రాఠి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.
ఈ సినిమాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూన్ పాండే మాట్లాడారు. ‘మాలిని అండ్ కో' చిత్రంలో అభినయానికి ప్రాధాన్యతవున్న పాత్రలో నటించాను. నటిగా నాకు మంచి గుర్తింపుతెచ్చే చిత్రమిది. ఈ తరహా పాత్రలు మరిన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పింది పూనమ్‌పాండే.

మాలిని
మాలిని చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

ఫస్ట్ లుక్
పూనమ్ పాండే తన తాజా సినిమా ‘మాలిని అండ్ కో' ఫోటోలను విడుదల చేసింది

కథేంటి?
టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రమిది. రెండు అంశాలను మేళవించి వినోదాత్మకంగా తెరకెక్కించామని యూనిట్ సభ్యులు తెలిపారు.

పూనమ్ పాండే
ఈ చిత్రంలో పూనమ్‌పాండే పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి. ఆమె అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకోనుందని తెలిపారు.

ముఖ్యపాత్రల్లో...
ఈ చిత్రంలో పూనమ్ పాండేతో పాటు సామ్రాట్, మిలన్, ఖుషీ, ఫరా, కావ్యాసింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: మరుధూరి రాజా.


Click it and Unblock the Notifications











