బూతు మంత్రులపై హాట్ భామ సెటైర్లు!
కర్నాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు ఏకంగా అసెంబ్లీలోనే సెల్ ఫోన్లో నీలి చిత్రాలు వీక్షిస్తూ కెమెరా కంటికి చిక్కిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్తలు సంచలన రేపాయి. దీంతో సదరు మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతోంది.
బూతు చిత్రాలు చూస్తే పట్టుబడిన మంత్రులపై హాట్ మోడల్ పూనమ్ పాండే సెటర్లు విసురుతోంది. ఇలాంటి వారు ఎన్నికలకు సిద్దం అయ్యే బదులు దానికి(---) సిద్ధం కావాలంటూ తన ట్విట్టర్ ద్వారా చుకరలంటించింది. అంతే కాదు బాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్ చేతన్ భగవత్, రామ్ గోపాల్ వర్మకు కూడా తమ ట్విట్టర్ ద్వారా ఈ బూతు బొమ్మలు చూసిన మంత్రులను విమర్శించారు. మన మంత్రులు అసెంబ్లీలో నీలి చిత్రాలు చూసే స్తాయిలో ప్రగతి సాధించారు. భారత్ వెలిగిపోతోంది అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.
ఉత్తర కర్నాటకలోని బాగలకోట జిల్లా సింధగిలో ఇటీవల అల్లరిమూకలు పాకిస్తాన్ జెండాను ఎగురవేయడంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతుండగా సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాన్ని చూస్తూ కనిపించారు. ఈ ఘటన సాయంత్రం 5 గంటల నుండి ఐదున్నర గంటల మధ్య జరిగింది. పక్కనే ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పాటిల్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఓడరేవుల శాఖ మంత్రి జె.కృష్ణ పాలేమార్‌కు చెందిన ఆ ఫోన్లో నీలిచిత్రం చూస్తూ వీరిద్దరూ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాల కళ్లలో పడటం గమనార్హం. ఈ ఘటనతో బిజెపి సర్కారు పరువు పూర్తిగా మంటగలిసింది.


Click it and Unblock the Notifications











