టీమిండియా కోసం సగం విప్పేసిన హాట్ మోడల్
బరితెగింపు పోకడలతో పబ్లిసిటీ పెంచుకుంటున్న మోడల్ పూనమ్ పాండే...మరోసారి రెచ్చి పోయింది. ఎక్స్ ఫోజింగ్ చేయడానికి, బట్టలిప్పడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని కాచుకుని కూర్చుంటున్న ఈ మోడల్... తాజాగా శ్రీలంకపై టీమిండియా సంచనలన విజయాన్ని పురస్కరించుకుని టాప్ లెస్ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసింది. అంతేకాకుండా ఈ ఫోటోను 18 సంవత్సరాల లోపు వారు చూడొద్దు, మీకేమైనా అయితే నా బాధ్యత కాదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చిన పూనమ్, వరల్డ్ కప్ సందర్భంగా టీమీండియాను టార్గెట్ చేసుకుని సంచలన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా కప్పు గెలిస్తే నగ్నంగా అందాల విందు చేస్తానని క్రికెట్ అభిమానుల్లో ఆశలు రేపింది. తీరా టీమిండియా కప్పు గెలిచాక విప్పడానికి తనకు అనుమతివ్వలేదనే సాకు చూపుతూ తప్పించుకుంది. ఆ తర్వాత లండన్ లో టోర్నమెంట్ సందర్భంగా టీమిండియాను ఉత్సాహ పరచడానికి అంటూ హాట్ హాట్ బికినీ ఫోటోలను పోస్టుచేసింది. ఇటీవల ట్విట్టర్లో చేరిన ప్రధాని మన్మోహన్ సింగ్ కు బికినితో వెల్ కం చెప్పి వార్తల్లో నిలిచింది.
అయితే పూనమ్ తీరుపై సంప్రదాయ వాదులు మండి పడుతున్నారు. పూనమ్ బరితెగింపుకు అడ్డుకట్టవేసే వారే లేరా? పబ్లిసిటీ కోసం చండాలపు పనులు చేస్తున్న ఆమె జోరుకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications












