twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మాలిని’గా మత్తెక్కిస్తున్న పూనమ్ పాండే (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ సంచలనం పూనమ్ పాండే త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రస్తుతం ‘మాలిని అండ్ కో' అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. వీరు.కె దర్శకుడు. మనీషా ఫిలింస్ పతాకంపై కిషోర్‌రాఠి నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూన్ పాండే మాట్లాడారు. ‘మాలిని అండ్ కో' చిత్రంలో అభినయానికి ప్రాధాన్యతవున్న పాత్రలో నటించాను. నటిగా నాకు మంచి గుర్తింపుతెచ్చే చిత్రమిది. ఈ తరహా పాత్రలు మరిన్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పింది పూనమ్‌పాండే.

    సినిమాకు సంబంధించని వివరాలు, పూనమ్ పాండే ఫోటోలు స్లైడ్ షోలో....

    కథేంటి?

    కథేంటి?

    టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రమిది. రెండు అంశాలను మేళవించి వినోదాత్మకంగా తెరకెక్కించామని యూనిట్ సభ్యులు తెలిపారు.

    పూనమ్ పాండే

    పూనమ్ పాండే

    ఈ చిత్రంలో పూనమ్‌పాండే పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి. ఆమె అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకోనుందని తెలిపారు.

    భిన్నంగా ఉంటుందట..

    భిన్నంగా ఉంటుందట..

    ఈ చిత్రం రొటీన్‌కి రొటీన్‌కు భిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

    20 రోజుల్లో షూటింగ్...

    20 రోజుల్లో షూటింగ్...

    ముంబై, కేరళతో పాటు హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 20రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరణ జరిపి షూటింగ్ పూర్తిచేసినట్లు తెలిపారు.

    ముఖ్యపాత్రల్లో...

    ముఖ్యపాత్రల్లో...

    ఈ చిత్రంలో పూనమ్ పాండేతో పాటు సామ్రాట్, మిలన్, ఖుషీ, ఫరా, కావ్యాసింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: మరుధూరి రాజా.

    English summary
    Actress Poonam Pandey who rose to fame with her seductive photos on social networking site is getting ready to test her luck in Tollywood. Poonam is gearing up to set the temperatures soaring down South through Veeru K’s upcoming trilingual movie ‘Malini & Co’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X