»   » మసాజ్ చేస్తూ పూనమ్ పాండే...(హాట్ వీడియో)

మసాజ్ చేస్తూ పూనమ్ పాండే...(హాట్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :బాలీవుడ్‌లో ‘నషా' చిత్రం తర్వాత వివాదాస్పద తార పూనమ్‌ పాండే తెలుగులో ‘మాలినీ అండ్‌ కో' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదివరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మనీషా ఫిలిమ్స్‌ సంస్థ చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వీరు కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూనమ్‌ సరసన హీరోగా సమ్రాట్‌ చేస్తున్నారు.ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సినిమా నుంచి ఓ హాట్ సాంగ్ ని వదిలారు. ఇందులో ఆమె రకరకాల మసాజుల గురించి చెప్తోంది. ఆ సాంగ్ ని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్ర సమర్పకుడు కిశోర్‌ రాఠీ మాట్లాడుతూ ‘‘ఇది టెర్రరిజం నేపథ్యంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఫిల్మ్‌. మంచి పాటలతో పాటు నాలుగు ప్రధాన యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. ఓ స్టార్‌ హీరో సినిమాకి ఎన్ని హంగులుంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి'' అన్నారు.

నిర్మాత మహేశ్‌ రాఠీ మాట్లాడుతూ ‘‘యువతను ఉర్రూతలూగించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. ‘ఎవడు', ‘లెజెండ్‌' వంటి చిత్రాలకు పనిచేసిన సి. రాంప్రసాద్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు'' అని చెప్పారు.

Poonam Pandey's Latest Malini & Co Video Song

పూనమ్‌ ఈ చిత్రంలో ఓ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తుందని దర్శకుడు వీరు తెలిపారు. ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన కిశోర్‌ రాఠీ కుమారుడు మిలన్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన ‘యమలీల'లో బాలనటుడిగా కనిపించారు. మిగిలిన రెండు పాటలను డిసెంబర్‌లో థాయిలాండ్‌లో చిత్రీకరిస్తాం. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనేది సంకల్పం'' అని ఆయన చెప్పారు.

పూనమ్‌ మాట్లాడుతూ ‘‘తొలి సినిమా ‘నషా' తర్వాత ఏడాది గ్యాప్‌తో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మధ్యలో నా వద్దకు చాలా స్ర్కిప్టులు వచ్చాయి కానీ, అవన్నీ ఒకే తీరుగా ఉండటంతో నచ్చలేదు. ‘మాలిని అండ్‌ కో' స్ర్కిప్ట్‌ అమేజింగ్‌గా అనిపించింది. వీరు చాలా స్పీడ్‌ డైరెక్టర్‌. ఒక్క రోజులో ఆరు సన్నివేశాలు తీసేశారు. నాకు తెలుగు తెలీకపోయినా సన్నివేశాలు అర్థమయ్యేలా చెప్పి, ఈజ్‌తో చేయించుకున్నారు. కేరళ మసాజ్‌ సెంటర్‌లో పనిచేసే అమ్మాయిగా నటిస్తున్నా'' అని చెప్పారు.

ఖుషీ, ఫరా, కావ్యాసింగ్‌, సాంబ, సోనాల్‌, జీవా, రవి కాలే, జెన్నీ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కళ: బాబ్జీ, ఫైట్స్‌: గణేశ్‌, అహ్మద్‌.

English summary
Poonam Pandey's Latest Telugu Movie Malini & Co's Hello Hello Mallu Doctor Full Video Song released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu