పబ్లిసిటీ స్టంట్ : న్యూడ్ ఫోటో లీక్ చేసిన పూనమ్
ముంబై : పబ్లిసిటీ ఎలా పెంచుకోవాలనే విషయం పూనమ్ పాండేకి తెలిసినంత ఇండియాలో మరే మోడల్‌కి తెలియదేమో? సాధారణ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్.....దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఎన్ని సెక్సీ వేషాలు వేయొచ్చే అన్నీ వేసింది. అందాల ఆరబోతలో ఆమె తెగింపు ఫలితమే ఇప్పుడు ఆమెను బాలీవుడ్ హీరోయిన్ ను చేసింది.
పూనమ్ పాండే నటించిన తొలి సినిమా 'నషా' ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి ఇప్పటికే రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శించిన పూనమ్ పాండే తాజాగా తన న్యూడ్ ఫోటోను లీక్ చేసి మీడియాలో చర్చనీయాంశం అయింది.
నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మిస్తున్నారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన 'జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం. నషా కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు.
'నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానుల్లో ఎన్నో ఆశలు రేపుతోంది. పూనమ్ పాండే పలు సీన్లలో నగ్నంగా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జులై 26న ఈచిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications












