»   » పూనమ్ పాండే సెక్సీ వీడియో: సల్మాన్ ఖాన్‌ను దెబ్బకొట్టింది

పూనమ్ పాండే సెక్సీ వీడియో: సల్మాన్ ఖాన్‌ను దెబ్బకొట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ఇటీవల యోగా వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ చిత్రీకరించిన ఈ వీడియో యూట్యూబును దడదడలాడిస్తోంది. ఈ వీడియో దెబ్బకు సల్మాన్ తాజా సినిమా ‘బజ్రంగి భాయిజాన్' ట్రైలర్ సైతం వెనకబడి పోయింది.

అవును మీరు చదివింది నిమజమే. సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్రింగి భాయ్ జాన్' ట్రైలర్ విడుదలైన రోజే పూనమ్ పాండే యోగా వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలకు పోటీపోటీగా వ్యూస్ వచ్చాయి. అయితే పూనమ్ సెక్సీ అందాల దెబ్బకు సల్మాన్ ఖాన్ మూవీ ట్రైలర్ వెనకబడిపోక తప్పలేదు.

Poonam Pandey's Yoga Video Beats Salman Khan's Bajrangi Bhaijaan Trailer

పూనమ్ పాండ్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మీడియా కూడా ఆమె హాట్ వీడియోకు తెగ ప్రచారం కల్పించింది. ఆ వీడియో సూపర్ హాట్ గా ఉండటంతో యూట్యూబులో చూసిన వారు తమ స్నేహితులకు షేర్ చేసారు. అలా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ వీడియో వైరల్ లా వ్యాపించింది.

పూనమ్ పాండే హాట్ వీడియో
ట్విట్టర్ ట్రెండింగులో సల్మాన్ ఖాన్ బజ్రింగి భాయిజాన్ ట్రైలరే టాపులో ఉన్నప్పటికీ.... యూట్యూడ్ కౌంట్ మాత్రం పూనమ్ పాండే హాట్ వీడియోకే ఎక్కువగా ఉంది. సల్మాన్ లాంటి స్టార్ హీరో సినిమా ట్రైలర్ ను పూనమ్ పాండే తన సెక్సీ అందాలతో పడగొట్టడం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.

సల్మాన్ ఖాన్ బజ్రంగి భాయ్ జాన్ ట్రైలర్
పూనమ్ పాండే యోగా హాట్ వీడియో యూట్యూడులో 11 లక్షల వ్యూస్ సొంతం చేసుకోగా.... బజ్రింగి భాయ్ జాన్ ట్రైలర్ కేవలం 7 లక్షల వ్యూస్ మాత్రంమే సొంతం చేసుకుంది. పూనమ్ పాండే విడుదల చేసిన ఈ వీడియో తన రాబోయే సినిమా ‘హెలెన్' పబ్లిసిటీ స్టంటులో భాగమే అని అంటన్నారు.

English summary
Poonam Pandey's yoga video created a storm on YouTube, so much so that the video has defeated Salman Khan's Bajrangi Bhaijaan trailer also.
Please Wait while comments are loading...