పద్దతిగా ఉంటే ఎవరూ చూడరు అందుకే ఇలా... పూనం పాండే
సెక్సీ ఇమేజ్ పొరపాటున వచ్చిందా? లేక మీరు కావాలనే కొని తెచ్చుకున్నదా? అన్న ప్రశ్నకు.. కొంత నేను కావాలనుకున్నాను. మరికొంత కొన్ని పొరపాట్ల వల్ల వచ్చింది. కొన్ని కాంట్రవర్సీలను నేనే స్వయంగా సృష్టించుకున్నాను. ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే స్ట్రిప్ చేస్తానని ప్రకటించినా, ట్విట్టర్‌లో న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేసినా ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే. కాంట్రవర్సీలే ఊహించనంత గుర్తింపు తెస్తాయి. అందుకే అలా చేశాను. ఇక నేను మనసులో ఏదీ దాచుకోను. ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాను. అలాంటి కొన్ని మాటలు కూడా కాంట్రవర్సీలకు దారి తీశాయి. ఏదైతేనేం నేను ఎలాంటి ఇమేజ్ కావాలనుకున్నానో దాన్ని సొంతం చేసుకోగలిగాను. కొన్నాళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో పూనం పాండే చెప్పిన మాటలివి... ఇప్పుడు కూడా ఏమాత్రం మారదా అభిప్రాయం... లేటేస్ట్ గా కూడా అదే మాట చెప్పింది పూనం...

ఇండస్ట్రీలో ఎదగాలంటే ఓ గాడ్‌ఫాదర్ ఉండాలి. నా వెనక అలాంటి వాళ్లెవరూ లేరు. అందరూ నడిచే దారిలో నడిస్తే నటిగా గుర్తింపు పొందటానికి చాలా కాలం పడుతుంది. అందుకే నేనొక షార్ట్ కట్ ఎంచుకున్నాను. కావాలనే నగ్న చిత్రాలు పోస్ట్ చేశాను. స్ట్రిపింగ్ చేశాను. 'నషా'లాంటి 'ఏ' రేటెడ్ మూవీలో నటించాను. ఈ దారి కచ్చితంగా నాకు గుర్తింపు తెస్తుందని తెలుసు. నా ప్లాన్ కరెక్ట్‌గా వర్కవుట్ అయింది.
కాకపోతే ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ గుర్తింపు వస్తుందని ఊహించలేకపోయాను. నా విషయంలో చెప్పాలంటే.. నేను ఎలాంటి ఇమేజ్ పొందాలనుకున్నానో దాన్ని సాధించాను. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. ఇండస్ర్టీలో పూనమ్ పాండేకంటూ ఓ ఇమేజ్ ఉంది. కాకపోతే నా పేరెంట్స్‌కి నాకున్న ఇమేజ్ గురించి కొన్ని అభ్యంతరాలున్నాయి. మా నాన్న చాలా స్ట్రిక్ట్. దాంతో నేను ఏ పని చేసినా పేరెంట్స్ ఏమనుకుంటారో అనే భయంతోనే చేస్తూ ఉంటాను. ట్విట్టర్‌లో నా ఫొటోలు చూసి అమ్మ కోప్పడింది. నెమ్మదిగా వాళ్లు నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు వాళ్ల నుంచి పూర్తి సపోర్ట్ ఉంది. అంటూ చెప్పేసింది.

ఒక్కసారి మీడియా, పబ్లిక్ దృష్టిలో పడిన తర్వాత ఆ కాంట్రవర్షియల్ ఇమేజ్ మెయింటైన్ చేయాల్సి వస్తోందని, ఇప్పుడు తాను కూడా పద్ధతిగా ఫోటోలవీ పెడితే ఎవరూ పట్టించుకోరని, అందుకే కాస్త డోస్ పెంచుతూ ఎప్పటికప్పుడు ఫాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంటానని తన ట్రేడ్ సీక్రెట్స్ చెప్పేసింది. న్యూస్‌లో ఉండడం పక్కనపెడితే తనకి ఎలాంటి పాత్రలు పోషించడం ఇష్టమని అడిగితే, నిండుగా చీర కట్టుకుని ఉండడం తనకి ఇష్టమని, మామూలుగా కూడా అలాగే వుండాలని ఉంటుంది కానీ, ఇప్పుడున్న ఇమేజ్‌కి అది సూట్ కాదంటూ నవ్వేసింది. ఎంతైనా ఆ మాత్రం డేర్ లేకుండా గ్లామర్ ఫీల్డ్ లో ఉండటం కష్టమే కదా అందుకే మాటలు కూదా అంతే బోల్డ్ గా చెప్పేస్తోందన్న మాట..


Click it and Unblock the Notifications











