పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజు క్రేజీగా స్పందించిన హాట్ బ్యూటీ.. ఆయనకు అంకితం!
Recommended Video

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. పవన్ మాత్రం ఎప్పటిలాగే పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కు దూరంగా ఉన్నారు. సినీరాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా పవన్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఊహించని వ్యక్తి నుంచి పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చాయి.

ఘనంగా వేడుకలు
పవన్ పుట్టిరోజు సంబరాలు, శుభాకాంక్షలతో ఆదివారం సోషల్ మీడియా మోతెక్కిపోయింది. తెలుగు రాష్ట్రలో అభిమానులు పవన్ పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి పవన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

హాట్ బ్యూటీ
ఎప్పుడూ వివాదాల్లో ఉండే హాట్ బ్యూటీ పూనమ్ పాండే నుంచి పవన్ కు శుభాకాంక్షలు రావడం కాస్త ఆశ్చర్యకర విషయమే. పూనమ్ పాండే ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసింది.
పవన్‌కు అంకితం
పూనమ్ పాండే ప్రస్తుతం లేడి గబ్బర్ సింగ్ అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నా అంటూ ప్రకటించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను నటిస్తున్న తెలుగు చిత్రం లేడి గబ్బర్ సింగ్ ని ఆయనకు అంకితం ఇస్తున్నా అంటూ పూనమ్ పాండే ట్వీట్ చేసింది.

గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ చిత్రం పవన్ సినీకెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు పూనమ్ పాండే లేడి గబ్బర్ సింగ్ అంటూ రాబోతోంది. సోషల్ మీడియాలో ఘాటు ఫోజులతో హీటెక్కించే పూనమ్ తెలుగు చిత్రంలో నటిస్తుండడం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











